తొలి రోజున రూ.45 కోట్ల గ్రాస్ ను రాబట్టిన వకీల్ సాబ్.. మొదటి వారం దాటిన తర్వాత కూడా జోరు కొనసాగించింది. అలా మొదలైన పవర్ స్టార్ ప్రభంజనం.. ఉగాది వరకూ కొనసాగింది. అటు.. ఓవర్సీస్ లోనూ సత్తాచాటాడు పవన్. లాక్ డౌన్ తర్వాత విడుదలైన ఈ భారీ చిత్రం.. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా కలెక్షన్లు సాధించింది. శరవేగంగా 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది.
కానీ.. వకీల్ సాబ్ దండయాత్రకు కరోనా అడ్డుకట్ట వేసింది. వేగంగా వ్యాపించిన వైరస్ తో.. కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. కోట్లాది రూపాయలు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నా.. కొవిడ్ అడ్డుపడింది. దీంతో.. తక్కువ సమయంలోనే అనివార్యంగా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది.
ఈ మధ్యనే ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం.. భారీ వ్యూయర్ షిప్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే చూసినవారితోపాటు చూడనివారు సైతం ఈ సినిమాను వీక్షిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. వకీల్ సాబ్ చిత్రాన్ని మరో ఓటీటీలోనూ రిలీజ్ చేయడం గమనార్హం. తెలుగు ఓటీటీగా పేరుగాంచిన ‘ఆహా’లో వకీల్ సాబ్ ను వదులుతున్నారు. అయితే.. ‘ఆహా’లో స్ట్రీమింగ్ అయ్యేది కేవలం ఓవర్సీస్ ఆడియన్స్ కు మాత్రమేనట. అమెజాన్ మాత్రం ఇక్కడివారి కోసం ప్రదర్శిస్తోంది. ఆ విధంగా.. వకీల్ సాబ్ రెండు ఓటీటీల్లోనూ ప్రసారం అవుతుండడం విశేషం.