కన్నా దూకుడుకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?

ఆంద్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దూకుడు పెంచింది. కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ లతో ప్రారంభమైన ఈ వ్యవహారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరింత రచ్చ చేశారు. వాస్తవానికి కన్నా కిట్ లపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. చత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఒక్కో కిట్ రూ.337 కొనుగోలు చేసిన విషయం ప్రస్తావిస్తూ, వాస్తవాలు వెల్లడించాలని కోరారు. ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ కన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి రూ. 20 కోట్లు […]

Written By: Neelambaram, Updated On : April 23, 2020 12:49 pm
Follow us on


ఆంద్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దూకుడు పెంచింది. కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ లతో ప్రారంభమైన ఈ వ్యవహారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరింత రచ్చ చేశారు. వాస్తవానికి కన్నా కిట్ లపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. చత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఒక్కో కిట్ రూ.337 కొనుగోలు చేసిన విషయం ప్రస్తావిస్తూ, వాస్తవాలు వెల్లడించాలని కోరారు. ఎంపీ విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ కన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి రూ. 20 కోట్లు తీసుకున్నారనడంతో వివాదం చెలరేగింది. అనంతరం బీజేపీ నాయకుల ఖండనలు, వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ ల కారణంగా ఈ వ్యవహారం మరింత ముదురింది.

బీజేపీ జాతీయ కార్యవర్గం ఈ వ్యవహారాన్నిసీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేధికను తెప్పించుకున్న జాతీయ నాయకత్వం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాకు ఇతర నాయకులు బాసటగా నిలవడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. బీజేపీ అంతర్గత వ్యవహారాలను విజయ సాయిరెడ్డి జోక్యం చేసుకోవడాన్ని తప్పు బట్టింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని నిరూపించేందుకు పార్టీ లోని ప్రతి ఒక్కరు సిద్ధం కావాలని సూచించారు.

మరోవైపు వైసీపీ, టీడీపీతో సదూరం పాటించాలన్న జాతీయ నాయకత్వం పార్టీ నాయకులకు సూచించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలకు దూరంగా ఉంటూ బీజేపీని పటిష్ట పరచాలనే వ్యూహంలో ఉందనేది స్పష్టం అవుతోంది. వైసీపీ నేతలు ఎదురుదాడి తీవ్రత పెంచిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ నాయకత్వం కన్నాకు బాసటగా నిలవడంతో పార్టీ నాయకులకు ఊరటనిచ్చింది. దీంతో ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్ ల వ్యవహారంలో బీజేపీ మరింత లోతుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.