Central Government- Power Reform: అసలు కరెంటు దందానే ఒక పట్టాన అర్థం కాదు. డిస్కమ్ ల పేరుతో, విద్యుత్ ప్లాంట్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్న తీరు ఎంతకీ అంతు పట్టదు. ఇంతటి భారత దేశ చరిత్రలో ఇప్పటివరకు డిస్కం లు ఎలా చెప్తే అలానే ప్రభుత్వాలు వ్యవహరించేవి. కానీ ఇన్నాళ్లు ఆ డిస్కమ్ లే విద్యుత్ సంస్కరణల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నాయి. ఇక లాభం లేదనుకున్న కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. డిస్కమ్ లకు పోటీగా ప్రైవేటు ఆపరేటర్లను తీసుకోస్తోంది. పనిలో పనిగా బొగ్గు కొనుగోలు, విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దోపిడీ వైఖరిని తుంచేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. మొన్నటి దాకా విద్యుత్ మీటర్లు పెడతామంటే గాయి గాయి చేసిన కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

దీనివల్ల ఏం జరుగుతుంది
టెలికం రంగంలో సంస్కరణలతో ప్రైవేట్ ఆపరేటర్లను ప్రోత్సహించడం ద్వారా డాటా, కాల్ చార్జీలను సామాన్యుడికి అందుబాటులోకి దిగి వచ్చేలా చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ రంగంలోనూ అలాంటి వినూత్న ప్రయోగానికి సమయత్తమైంది. వినియోగదారుడు తనకు ఇష్టమైన కంపెనీ నుంచి విద్యుత్ ను కొనుక్కునేలా అవకాశం ఉండాలని పట్టుదలతో ఉన్న కేంద్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశంలోనే ఈ విద్యుత్ సవరణ బిల్లు 2022 ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బిజెపి ప్రభుత్వానికి ఉభయ సభల్లోనూ తగినంత బలం ఉంది. ఇక ఈ బిల్లు ఆమోదం పై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు.
Also Read: India- China: మోడీ ఫోన్ కాల్ తో భారత్, చైనాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు..? అసలేమైంది?
మార్పులు చేర్పులు చేశారు
29 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ సంస్థలదే పెత్తనం. ఈ ప్రాంతంలో ఆది నుంచి వారికి గుత్తాధిపత్యం ఎక్కువ. అందుకే వారు ఏ రేటు చెప్తే ఆ రేటుకు విద్యుత్ కొనాల్సిన ఆగత్యం వినియోగదారులకు ఉంది. ఈ క్రమంలో ఆ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు డిస్కమ్ లకు డీ- లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం అనుకున్నది. కానీ దీనికి రాష్ట్రాలు, విద్యుత్ ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ క్రమంలోనే కాస్త పదాలను మార్చి ఏ ప్రాంతంలోనైనా, ఎంతమందికైనా లైసెన్స్ ఇచ్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే ఇప్పటికే ఉన్న డిస్కమ్ లకు సమాంతరంగా ఎన్ని కంపెనీలకైనా విద్యుత్ సరఫరా చేయొచ్చు. డిస్కమ్ లకు తోడుగా వాటికి కూడా లైసెన్స్ ఇస్తారు. ఇక 2003 నాటి విద్యుత్ సంస్కరణల చట్టం కింద కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా డిస్కమ్ లను ఎత్తేశారు. ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. ఆ విధానంలో ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పూణె లో విద్యుత్ పంపిణీ బడాబడా ప్రైవేటు విద్యుత్ కంపెనీల ఆధీనంలోకి వెళ్ళింది. దాంతో పోలిస్తే ఇప్పటి విధానం మెరుగని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఉదాహరణకి ఒక ఏరియాలో ప్రభుత్వ డిస్కమ్, ఎంత మంది ప్రైవేటు ఆపరేటర్లైనా సేవలు అందించవచ్చు. దీనివల్ల ప్రైవేట్ ఆపరేటర్లతో డిస్కమ్ లు పోటీ పడాల్సి వస్తుంది. నాణ్యమైన సేవలు అందించాల్సి వస్తుంది.

మరి కీలక రంగాలలో ఏం చేస్తుంది,?
డిస్కమ్ ల మనుగడలో వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులే చాలా కీలకం. ఒకవేళ గనుక ప్రైవేట్ లైసెన్సీలు రంగంలోకి దిగితే తొలుత వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు డిస్కౌంట్ ఆశ చెప్పి కనెక్షన్ లాక్కునే అవకాశం ఉంది. ప్రస్తుతం వాణిజ్య వినియోగదారులకు యూనిట్‌కు రూ.7 పైనే డిస్కమ్ లు వసూలు చేస్తున్నాయి. ఒకవేళ ఇందులోకి ప్రవేటు ఆపరేటర్లు అడుగుపెడితే యూనిట్ రూ. ఆరు లోపే అందించే అవకాశాలు ఉన్నాయి. ఇక మన రాష్ట్రంలో ఒక కోటి 24 లక్షల మంది ఎల్టి (లో టెన్షన్) గృహ వినియోగదారులు ఉన్నారు. తొలి విడతలో వీరిపై ప్రైవేటు లైసెన్సీలు కన్నేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 17 లక్షల ఎల్టి గృహేతర కనెక్షన్లు, లక్ష ఎల్టి పారిశ్రామిక కనెక్షన్లు, 59 వేల ఎల్టి జనరల్ కనెక్షన్లు, 16,446 హెచ్‌టీ కనెక్షన్లను డిస్కమ్ ల నుంచి లాక్కునేందుకు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. ఇక విద్యుత్ అందించేందుకు ప్రభుత్వ రాయితీ పొందని 200 యూనిట్ల పైన వాడే గృహ వినియోగదారులపై డిస్కౌంట్ వల వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 26.6 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వాటికి విద్యుత్ అందించేందుకు ప్రైవేటు లైసెన్సీలు ముందుకు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. కాగా యూనిట్ విద్యుత్ వినియోగదారుడికి అందించేందుకు డిస్కమ్ లు అన్నీ కలుపుకొని రూ. 7.03 వసూలు చేస్తాయి. ఇందులో ఉద్యోగుల జీతభత్యాలు కూడా ఉన్నాయి. అదే ప్రైవేటు లైసెన్సీలు రంగంలోకి దిగితే యూనిట్ ధర రూ. ఆరు దాటే అవకాశాలు లేవు. విద్యుత్ సంస్థల్లో ఎస్ఈ వేతనం మూడు లక్షల పై చిలుకు ఉంటుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వేతనం కూడా అంత ఉండదు.
ప్రీ పెయిడ్ మీటర్లు దిక్కు
ఇక విద్యుత్ చట్టం అమల్లోకి వస్తే ప్రైవేట్ ఆపరేటర్లు ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తారు. ప్రభుత్వ డిస్కౌంట్ లైన్లు వాడుకుంటూ కొత్త కనెక్షన్ లకి విద్యుత్ ను అందిస్తారు. ప్రభుత్వ డిస్కమ్ ల నుంచి ఎంత మేర విద్యుత్ ను వాడుకుంటారో అంతమేరకు చెల్లింపులు చేస్తారు. ప్రస్తుతం డిస్కమ్ లు చేసుకున్న పీపీఏ (విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు) లకు రక్షణ ఉంటుంది. ప్రైవేట్ ఆపరేటర్లు కూడా ఈ పీపీఏ ల్లో భాగస్వాములు అవుతారు. ప్రిపేయిడ్ మీటర్లు బిగించడం వల్ల ఇంటింటికి తిరిగి రీడింగ్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. సెల్ ఫోన్ లాగే కరెంటు మీటర్ల ను రీచార్జ్ చేసుకుని వాడుకోవాల్సి ఉంటుంది.
క్రాస్ సబ్సిడీ రద్దు
25 యూనిట్‌లోపు కరెంటు మాత్రమే వాడే పేదలకు రాయితీ మీద కరెంటు ఇచ్చేందుకు డిస్కమ్ లు బహిరంగ విపణి నుంచి కరెంటు కొంటున్న వారి వద్ద, హెచ్‌టీ వినియోగదారుల వద్ద క్రాస్ సబ్సిడీ చార్జెస్ వసూలు చేస్తున్నాయి. ఇక సొమ్మును పేద వర్గాలకు రాయితీపై కరెంటు ఇచ్చేందుకు ఖర్చుపెడుతున్నాయి. క్రాస్ సబ్సిడీ మాయమైతే పేదలకు కరెంటు భారమే. లేదంటే అందుకు అవుతున్న ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్ కు దరఖాస్తు చేసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సిబ్బంది రైతుల నుంచి రూ.25,000 నుంచి రూ.50,000 దాకా వసూలు చేస్తున్నారు. కొత్తగా ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలన్నా ₹లక్షదాక దండుకుంటున్నారు. ఇక ఇళ్లకు కొత్త కనెక్షన్ పెట్టుకోవాలనుకుంటే రూ 5,000 దాకా ముట్ట చెప్పాల్సిందే. ఇక ఈ బిల్లు ఆమోదం పొంది, ప్రైవేట్ డిస్కమ్ లు అడుగుపెడితే వసూళ్ల దందా పూర్తి ఆగిపోతుంది. కనెక్షన్ కావాలని వివరాలు నమోదు చేసుకుంటే చాలు నిమిషాల్లో ఇళ్ళ ముందు వాలిపోయి కనెక్షన్ ఇచ్చే అవకాశాలుంటాయి.
డిస్కమ్ లకు ఇబ్బంది తప్పదు
డిస్కమ్ లకు నష్టాలు వచ్చే ప్రాంతాలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి వీలు లేకుండా ప్రైవేటు సంస్థలు ఎక్కడ కోరితే అక్కడ మొత్తం లైసెన్సులు ఇవ్వాల్సి ఉంటుంది. లైసెన్స్ మంజూరు అధికారం విద్యుత్ నియంత్రణ మండలి కే ఉన్నా దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత వ్యవధిలోనే ఇవ్వాల్సి ఉంటుంది. దీని ప్రకారం కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు. ఇది పూర్తి చట్టంగా మారితే ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ లాగే డిస్కమ్ ల పరిస్థితి ఉండబోతుంది. అదే జరిగితే విద్యుత్ పూర్తిగా ప్రైవేట్ కంపెనీల చేతిలోకి వెళ్తుంది. దీనిపై విపక్ష పార్టీలు ఏమంటాయో వేచి చూడాల్సిందే.
Also Read:YS Vijayamma- YSRTP: వైఎస్సార్ టీపీని విజయమ్మ విజయతీరాలకు చేరుస్తుందా?
[…] […]