https://oktelugu.com/

Amaravati As AP Capital: ఏపీ రాజధానిగా అమరావతి.. గుర్తిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం

Amaravati As AP Capita:  ఏపీ సీఎం జగన్ గుర్తించినా.. గుర్తించకపోయినా.. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించి ముందుకెళ్లినా సరే.. కేంద్రం మాత్రం తన స్టాండ్ తీసుకుంది. ఏపీ రాజధానిని ఖాయం చేసింది. ఈ పరిణామం వైసీపీ ప్రభుత్వానికి షాక్ గా మారింది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గందరగోళం కొనసాగుతోంది. ప్రభుత్వం మూడు రాజధానులు ఖాయమంటున్నారే ఆ దిశగా ముందుడగు పడడం లేదు. కేంద్రం […]

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2022 / 09:35 PM IST

    Amaravati

    Follow us on

    Amaravati As AP Capita:  ఏపీ సీఎం జగన్ గుర్తించినా.. గుర్తించకపోయినా.. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించి ముందుకెళ్లినా సరే.. కేంద్రం మాత్రం తన స్టాండ్ తీసుకుంది. ఏపీ రాజధానిని ఖాయం చేసింది. ఈ పరిణామం వైసీపీ ప్రభుత్వానికి షాక్ గా మారింది.

    Amaravathi

    ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గందరగోళం కొనసాగుతోంది. ప్రభుత్వం మూడు రాజధానులు ఖాయమంటున్నారే ఆ దిశగా ముందుడగు పడడం లేదు. కేంద్రం కూడా రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే అని పదే పదే తేల్చిచెబుతోంది. తాజాగా కేంద్రం ఏపీ రాజధాని అమరావతి పేరుతో కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.

    ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ కేంద్రం మరోసారి నిధులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. రాజధాని అమరావతి పేరుతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టింది. అమరావతినే ఏపీ రాజధానిగా పేర్కొంటూ 2022-23 బడ్జెట్ లో కేంద్రప్రభుత్వం కేటాయింపులు చేసింది.

    Also Read: New Rajya Sabha Member From AP: వైసీపీ నుంచి రాజ్యసభకు అదానీ సతీమణి

    విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించింది.కేంద్రబడ్జెట్ లో పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో సచివాలయం.. ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ప్రొవిజన్ తీసుకొచ్చింది.

    సచివాలయ నిర్మాణానికి 1213 కోట్లు, ఉద్యోగుల నివాస గృహాల కోసం 1126 కోట్లు అంచనా వ్యయంగా ప్రొవిజన్ లో కేంద్రం పేర్కొంది. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించింది.

    గత నెలలోనే జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రాజధానిపై క్లారిటీ ఇవ్వాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ రాజ్యసభలో కేంద్రహోంశాఖను కోరారు. దీనికి కేంద్రం ఏపీకి రాజధాని అమరావతియే అని స్పష్టతనిచ్చారు. తాజాగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకొని కేంద్రం వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.

    Also Read: PMMVY: కేంద్రం సూపర్ స్కీమ్.. అమ్మాయి పుడితే రెండో కాన్పులో డబ్బులు పొందే ఛాన్స్!

    Recommended Video: