Special Facilities Retired Chief Justices: రిటైర్ అయ్యాక కూడా చీఫ్ జస్టిస్ లకు ప్రత్యేక సదుపాయాలు… అవేంటంటే..

Special Facilities Retired Chief Justices: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా మన తెలుగువారు ఎన్వీ రమణ రిటైర్ కాబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పెండింగ్ లో ఉన్న సంచలన తీర్పులను ఇస్తూ ఊరట కలిగిస్తున్నారు. జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిస్కరించారు. పెగాసస్ సహా కేంద్రం తీరుపై ఇటీవల ప్రశ్నించారు. అయితే కేంద్రప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు జడ్జీలకు తీపికబురును అందించింది. ఇక మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పదవీ విరమణ పొందిన తర్వాత కూడా కొన్ని […]

Written By: NARESH, Updated On : August 26, 2022 4:24 pm
Follow us on

Special Facilities Retired Chief Justices: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా మన తెలుగువారు ఎన్వీ రమణ రిటైర్ కాబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పెండింగ్ లో ఉన్న సంచలన తీర్పులను ఇస్తూ ఊరట కలిగిస్తున్నారు. జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిస్కరించారు. పెగాసస్ సహా కేంద్రం తీరుపై ఇటీవల ప్రశ్నించారు. అయితే కేంద్రప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు జడ్జీలకు తీపికబురును అందించింది. ఇక మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పదవీ విరమణ పొందిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అవేంటో తెలుసుకుందాం.

supreme court

-చీఫ్ జస్టిస్ గా రిటైర్ మెంట్ అయ్యాక కూడా 6 నెలల పాటు అద్దె కూడా లేకుండానే నివాస వసతిని పొందేలా నిబంధనలు మార్చారు.

Also Read: Twitter- IRCTC: ట్విట్టర్, ఐఆర్.సీ.టీసీకి షాకిచ్చిన పార్లమెంటరీ ప్యానెల్..

-రిటైర్ అయ్యాక ఒక సంవత్సరం పాటు రౌండ్ ది క్లాక్ భద్రతను కూడా చీఫ్ జస్టిస్ లకు ఇస్తారు.

-ఒక సంవత్సరం పాటు డ్రైవర్ సదుపాయం. సెక్రటేరియట్ అసిస్టెంట్ ను పొడిగించేందుకు అనుమతిస్తారు. పూర్తి వేతనం, అలవెన్సులను కలిగిన డ్రైవర్ కు అనుమతి ఉంటుంది.

supreme court

-విమానాశ్రయాల్లోని సెరిమోనియల్ లాంజ్ లలో మర్యాదలు, ప్రొటోకాల్ కు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లు అర్హులు

-ఈ సదుపాయం అందుకుంటున్న మొదటి చీఫ్ జస్టిస్ మన ఎన్వీరమణనే కావడం విశేషం.

Also Read:Team India New Jersey- Asia Cup 2022: ఆసియా కప్ కోసం కొత్త జెర్సీతో టీమిండియా.. అదిరిపోలా..

Tags