Petrol Price Hike In India: ఇప్పటికే ధరలు ఘోరంగా పెరిగిపోతున్నాయి. సగటు జీవి జీవితం తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రం మరోసారి చమురు మంట పెట్టింది. వారంలో రెండోసారి ధరలు పెంచి.. చుక్కలు చూపించింది. దీంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల లీటర్ పెట్రోల్ మీద మూడు రూపాయలు.. లీటర్ డీజిల్ మీద మూడు రూపాయలు పెంచింది కేంద్రం. అది సరిపోదన్నట్టుగా ఇప్పుడు మరోసారి షాక్ ఇచ్చేసింది.. దేశవ్యాప్తంగా ధరలను విపరీతంగా పెంచేసింది. లీడర్ డీజిల్ మీద.. లీటర్ పెట్రోల్ మీద 90 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల వ్యవధిలో చమురు ధరలు పెరగడం ఇది రెండవసారి.
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అంతర్జాతీయ సంక్షోభం ఏర్పడింది. దీనివల్ల గుడి సరఫరా విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతోంది. ఫలితంగా నాలుగు రోజుల క్రితం లీటర్ పెట్రోల్ మీద, లీటర్ పెట్రోల్ మీద మూడు రూపాయలు చొప్పున కేంద్రం పెంచింది. ధరల నియంత్రణ కోసం కేంద్రం ఇప్పటికే పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం వసూలు మొత్తాన్ని తాత్కాలికంగా ఆపేసింది.
పెట్రోల్ ధరలు దేశంలో ఎలా ఉన్నాయంటే..
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలైన ఢిల్లీలో 98.64, కోల్ కతా లో 109.70, ముంబైలో 107.59, చెన్నైలో 104.49 ధర ఉంది.
డీజిల్ ధరలు
లీటర్ డీజిల్ ధర దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన ఢిల్లీలో 91.58, కోల్ కతా లో 96.07, ముంబై 94.08, చెన్నై 96.11 గా ఉంది.
