https://oktelugu.com/

Visakhapatnam steel plant: విశాఖ ఉక్క ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపుతోందా?

Visakhapatnam steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటం 300 రోజులకు చేరింది. దీంతో కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే మొగ్గు చూపడంతో కార్మికుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్లాంట్ రక్షణకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమం సాగుతున్నా అధికార పార్టీ వైసీపీ, కేంద్రంపై ఒత్తిడి మాత్రం పెంచడం లేదు. దీంతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 8, 2021 / 04:58 PM IST
    Follow us on

    Visakhapatnam steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటం 300 రోజులకు చేరింది. దీంతో కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే మొగ్గు చూపడంతో కార్మికుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్లాంట్ రక్షణకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమం సాగుతున్నా అధికార పార్టీ వైసీపీ, కేంద్రంపై ఒత్తిడి మాత్రం పెంచడం లేదు. దీంతో రోజురోజుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    Visakhapatnam steel plant

    పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీలు నిరసన చేపడుతున్నాయి. లాభాల బాటలో పయనిస్తున్న విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం భావించడం సరైందని కాదని చెబుతున్నారు. కేంద్రం ప్రైవేటీకరణపై పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు. కార్మికులకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి.

    విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. కార్మికులకు అండగా ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు చేస్తున్నా కేంద్రం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. దీంతో కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. పార్లమెంట్ వేదికగా కూడా పోరాడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read: AP Government: ఏపీ సర్కార్ చేసిన అప్పు ఎంతో తెలుసా?

    గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని కేంద్రానికి లేఖ రాసినా దానిపై స్పందన కానరావడం లేదు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తథ్యమనే అభిప్రాయం అందరిలో వస్తోంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేంద్రం మాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటీకరణపై ఎవరి మాట వినేది లేదని తేల్చి చెబుతోంది. దీంతో దీనిపై ఎవరు కూడా మాట్లాడేందుకు సాహసం చేయడం లేదు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

    Also Read: AP Government employees: తప్పెవరిది?: ఏపీ ఉద్యోగులదా? జగన్ సర్కార్ దా?

    Tags