Minister Goutham Reddy Passed Away: ఏపీలో విషాదం చోటుచేసుకుంది. ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ఈ రోజు హఠాత్తుగా మరణించారు. ఆయన చాలా చిన్న వయసులోనే మరణించడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. ఆయన ఇప్పుడు వైసీపీలో కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. మొదటి నుంచి జగన్‌కు నమ్మకస్తుడిగా మెలిగారు. ఆయన తాత నుంచే వారి కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఎంతో సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చారు గౌతమ్.
కాగా ఆయన మరుణం పట్ల చాలా మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గౌతమ్ రెడ్డి కుటుంబానికి సంతాపం తెలిపారు. వారి తాత హయాం నుంచే ఆ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక జగన్ కూడా తన సహచరు మంత్రిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ రోజు హైదరాబాద్ చేరుకుంటారు జగన్.
Also Read: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: పంజాబ్ లో గెలుపెవరిది?
ఇక మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. విషయం తెలుసుకుని తాను షాక్ అయ్యానని, వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. అటు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. చాలా చిన్న వయసులోనే గౌతమ్‌రెడ్డి ఎంతో పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్నారని, ఎంతో సంస్కారవంతమైన వ్యక్తి అంటూ గుర్తు చేసుకున్నారు.
మరో మంత్రి అనిల్ కుమార్ తనకు అన్న లాంటి గౌతమ్ రెడ్డిని కోల్పోవడం బాధ కలిగించిందటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మంత్రి ఆళ్ల నాని కూడా స్పందించారు. గౌతమ్‌ను కోల్పోవడం పార్టీకి తీరని లోటు అంటూ ఆవేదన తెలిపారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ తాను రాత్రే కలిశానని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందంటూ వాపోయారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనియాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి మనో బలం కలగజేయాలని కోరారు.