CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025లో క్లాస్ 10, క్లాస్ 12 బోర్డు పరీక్షలను ఫిబ్రవరి 15, 2025 నుండి నిర్వహించనుంది. మొత్తం 44 లక్షల మంది విద్యార్థులు 204 వేర్వేరు సబ్జెక్టులలో పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలకు ముందుగా సీబీఎస్ఈ బోర్డు విద్యార్థులకు పరీక్షా కేంద్రంలో అనుమతించే, నిషేధించిన వస్తువుల జాబితా, గైడ్‌లైన్లను విడుదల చేసింది.
పరీక్షా కేంద్రంలోకి అనుమతించే వస్తువులు :
* అడ్మిట్ కార్డ్, స్కూల్ ఐడెంటిటీ కార్డ్ (రెగ్యులర్ విద్యార్థుల కోసం)
* అడ్మిట్ కార్డ్, ప్రభుత్వ ఇష్యూను ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ (ప్రైవేట్ విద్యార్థుల కోసం)
* స్టేషనరీ వస్తువులు: ట్రాన్స్పరెంట్ పౌచ్, జియోమెట్రీ/పెన్సిల్ బాక్స్, బ్లూ/రాయల్ బ్లూ ఇంక్/బాల్ పాయింట్/జెల్ పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, ఎరేజర్
* అనలాగ్ వాచ్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్
* మెట్రో కార్డ్, బస్ పాస్, డబ్బు
నిషేధిత వస్తువులు:
* ఏదైనా స్టేషనరీ వస్తువు – ఉదాహరణకు, టెక్స్టు మెటీరియల్స్ (ప్రింట్ చేసిన లేదా రాతపూర్వకంగా), కాగితాల ముక్కలు, క్యాల్క్యులేటర్ (లెర్నింగ్ డిసేబిలిటీ ఉన్న విద్యార్థులు, ఉదాహరణకు డిస్క్యాల్క్యులియా ఉంటే క్యాల్క్యులేటర్ ఉపయోగించవచ్చు, పరీక్షా కేంద్రం అందిస్తుంది), పెన్ డ్రైవ్‌లు, లాగ్ టేబుల్ (పరీక్షా కేంద్రం అందిస్తుంది), ఎలక్ట్రానిక్ పెన్/స్కానర్, ఇతర సామాన్లు.
* ఏమైనా కమ్యూనికేషన్ పరికరాలు – ఉదాహరణకు, మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఎయిర్‌ఫోన్లు, మైక్రోఫోన్, పెజర్, హెల్త్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్‌లు, కెమెరా, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు.
* ఇతర వస్తువులు: వాలెట్, గాగుల్స్, హ్యాండ్బ్యాగ్‌లు, పౌచ్‌లు, ఇతర వ్యక్తిగత వస్తువులు.
* ఆహార పదార్థాలు (డయాబెటిక్ విద్యార్థులకు మాత్రమే ఆహారం అనుమతించబడుతుంది).
ఈ నిషేధిత వస్తువులు ఉపయోగిస్తే అది “అన్‌ఫేర్ మీన్స్” కేటగిరీగా పరిగణించబడుతుంది.నిబంధనల ప్రకారం శిక్షలు పడతాయి.
డ్రస్ కోడ్:
* రెగ్యులర్ విద్యార్థుల కోసం: స్కూల్ యూనిఫారం
* ప్రైవేట్ విద్యార్థుల కోసం: సన్నని బట్టలు
ఇవి పాటించడం ప్రతి విద్యార్థి కోసం తప్పనిసరి.