https://oktelugu.com/

Kalvakuntla Kavitha CBI : ఉత్కంఠ: కవిత ఇంటికి సీబీఐ.. భారీ సెక్యూరిటీ.. ఏం జరుగునుంది?

Kalvakuntla Kavitha CBI : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూతురు, ఎమ్మెల్సీ కవితను విచారించడానికి సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు. ఉదయం 10:30 గంటలకే ఇద్దరు అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. 11 గంటలకు మరి కొంతమంది వచ్చారు. మొత్తం రెండు వాహనాల్లో 11 మంది అధికారులు కవిత నివాసానికి చేరుకున్నారు. వారిలో ఒకరు మహిళా అధికారి ఉన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2022 1:23 pm
    Follow us on

    Kalvakuntla Kavitha CBI : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూతురు, ఎమ్మెల్సీ కవితను విచారించడానికి సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు. ఉదయం 10:30 గంటలకే ఇద్దరు అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. 11 గంటలకు మరి కొంతమంది వచ్చారు. మొత్తం రెండు వాహనాల్లో 11 మంది అధికారులు కవిత నివాసానికి చేరుకున్నారు. వారిలో ఒకరు మహిళా అధికారి ఉన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత స్టేట్‌మెంట్‌ను అధికారులు తీసుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే న్యాయవాదులు కూడా కవిత ఇంటికి చేరుకున్నారు. వారి సమక్షంలోనే కవిత వివరణను అధికారులు తీసుకోనున్నట్టు తెలుస్తుంది.]

     

     

    విచారణకు ప్రత్యేక గది..
    ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు విచారణకు ప్రతత్యేక గది కావాలని కోరడంతో ఆమేరకు కవిత ప్రత్యేక గది ఏర్పాటు చేఏయించచారు. సీబీఐ అధికారుల బృందానికి డీఐసీ రాఘవేంద్రవత్స నేతృత్వం వహిస్తున్నారు.

    భారీ బందోబస్తు..
    కవిత వివరణకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆమె ఇంటి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె నివాసంలోని ఓ ప్రత్యేక గదిలో కవిత వివరణ తీసుకుంటున్నారు అధికారులు. అడ్వకేట్ల ఆధ్వర్యంలోనే ఈ స్టేట్‌ మెంట్‌ రికార్డ్‌ చేయనున్నట్టు తెలుస్తుంది. వివరణ సమయంలో ఈ గదిలోకి ఎవరిని అనుమతించడం లేదు.

    విచారణ తర్వాత ఏం జరుగొచ్చు..
    తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనయ కవితను సీబీఐ విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విచారణ ఎంతసేపు జరుగుతుంది. విచారణ తర్వాత సీబీఐ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. నిజానికి ఈ నెల 6న కవిత నుంచి సీబీఐ వివరాలు సేకరించాల్సి ఉంది. సీబీఐ నోటీసులపై టీఆర్‌ఎస్‌ అనేక తర్జనభర్జనల అనంతరం … చివరికి విచారణ ఎదుర్కోడానికి అధికార పార్టీ సిద్ధమైంది. దీంతో సీబీఐ విచారణపై కవిత స్పష్టత ఇచ్చింది. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంంటానని సీబీఐ అధికారులకు కవిత సమాచారం చేరవేశారు. కవిత ఇచ్చిన తేదీలను పరిగణలోకి తీసుకున్నామని, 11న ఉదయం 11 గంటలకు విచారణ వస్తామని, అందుబాటులో ఉండాలంటూ సీబీఐ డీఐజీ రాఘవేంద్రవత్స ఎమ్మెల్సీ కవితకు మెయిల్‌ పంపారు. సానుకూలం వ్యక్తం చేస్తూ కవిత స్పందించారు.

    విచారణ తర్వాత కీలక పరిణామం..
    ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితను సీబీఐ విచారించాలని అనుకోవడం కీలక పరిణామంగా చెబుతున్నారు. ఎందుకంటే సీబీఐ విచారించిన తర్వాత కవిత పాత్ర ఏమీ లేదని తేల్చేస్తే… రాజకీయంగా అది బీజేపీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీన్ని టీఆర్‌ఎస్‌ రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. ఆ అవకాశాన్ని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఇస్తుందని అనుకోలేం. కవితను ఇరికించే వ్యూహంలో సీబీఐ వేస్తున్న మొదట అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీబీఐ విచారణ వరకూ వెళ్లి, ఆ తర్వాత బీజేపీ వెనక్కి తగ్గే అవకాశాలు లేవని దేశ వ్యాప్తంగా ఆ పార్టీ చర్యలను గమనిస్తున్న వారు చెబుతున్న మాట. కేసీఆర్‌ కుమార్తె కావడంతో టీఆర్‌ఎస్‌ ఆందోళన చెందుతోంది. తమ అధినాయకుడి కుటుంబాన్నే టార్గెట్‌ చేస్తున్న బీజేపీకి, ఇక తామో లెక్క అని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు. సీబీఐ విచారణ తర్వాత జరగబోయే పరిణామాలు తెలంగాణలో రాజకీయంగా కీలక మలుపునకు దారి తీసే అవకాశం వుంది.