Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్ట్ లకు సీబీఐ మానసికంగా సిద్ధమైందా? కొద్దిరోజుల్లో ఏపీ సంచలనాలకు వేదిక కానుందా?కింగ్ పిన్ లు బయటకు వచ్చే అవకాశముందా? ఈ నెల 28న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణే తుది అంకంగా తేలనుందా? ఆయన వెల్లడించే అంశాలతో కీలక ఒక కొలిక్కి తేనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. కేసుల నేరారోపణలు ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోర్టుకు విన్నివించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇటీవల సునీల్ యాదవ్ పిటీషన్ పెట్టుకున్నారు. దీనిపై సీబీఐ కౌంటర్ పిటీషన్ దాఖలు చేసింది.
అయితే గతంలో వివేకా భార్య సౌభాగ్య సునీల్ యాదవ్ ఎంత ప్రమాదకరమో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. వివేకను ఎలా హత్యచేసింది? ఎవరు చేయించింది? ఎందుకు చేయించింది? సవివరాలను అఫిడవిట్ లో పొందుపరిచారు. దానికి ఆధారాలను కూడా అందులో పొందుపరిచారు. దీంతో ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి పాత్రపై కూడా ఆధారాలు చూపించగలిగారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దని ఒక వైపు పిటీషన్ దాఖలు చేస్తూనే.. రెండోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి విచారణకు పిలుస్తుండడంతో ఎంతో సంచలనం జరగబోతుందన్న టాక్ నడుస్తోంది.
సరిగ్గా గత ఎన్నికలకు ముందు మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ లోటస్ ఫండ్ వెళ్లి టిక్కెట్ల విషయం చర్చించి పులివెందుల చేరుకున్న వివేక అదే రోజు ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఆ రోజు రాత్రి, తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుగా చిత్రీకరించారు. పగడ్బందీగా హత్య చేసి సహజ మరణంగా చెప్పే ప్రయత్నం చేశారు. తరువాత హత్య అని చెప్పి ఆ నేరాన్ని చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి బీటెక్ రవీలపై నెట్టారు. రాజకీయంగా ఇష్యూను వాడుకున్నారు. అయితే సీబీఐ విచారణలో హత్య వేనుక పాత్రదారులు, సూత్రధారులు ఎవరో బయటకు వస్తోంది. దాదాపు క్లారిటీ వచ్చేసింది.
వివేక హత్య కేసులో కీలక అరెస్ట్ లకు సీబీఐ రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఏపీ పరిధిలో కేసు ఉన్నప్పుడు ఏకంగా సీబీఐ అధికారులనే బెదిరింపులకు దిగారు. ఏపీ పోలీస్ శాఖ సహకరించలేదన్న వార్తలు కూడా వచ్చాయి. అందుకే దీనిని సీబీఐ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కేంద్రం కూడా అరెస్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డి విచారణతో సంచలనాలు నమోదయ్యే చాన్స్ ఉందన్న ప్రచారం ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా సాగుతోంది.