https://oktelugu.com/

దేశీ వ్యాక్సిన్లు నీళ్లతో సమానమట..: అప్పుడే బడా కంపెనీల నెగెటివ్‌ ప్రచారం

ఇండియాలో వాడే ఏ వస్తువు పైన చూసినా మేడిన్‌ చైనా అనే కనిపిస్తూ ఉంటుంది. అంటే.. మన దగ్గర అంత టెక్నాలజీ లేకనా..? లేక మన వస్తువులపై అంత నమ్మకం లేకనా..? అంటే ఏదీ చెప్పలేం. ముఖ్యంగా ఇద్దరి వ్యాపారుల మధ్య పోటీతత్వం ఉండడం కామన్‌. అయితే.. ఒక కంపెనీని తొక్కిపెట్టాలని వాటి మీద వ్యతిరేక ప్రచారానికి దిగుతుంటాయి. అయితే.. ఇప్పుడు ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్‌ల మధ్య పోటీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో తయారైన వ్యాక్సిన్‌పైనా […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 5, 2021 / 01:32 PM IST
    Follow us on


    ఇండియాలో వాడే ఏ వస్తువు పైన చూసినా మేడిన్‌ చైనా అనే కనిపిస్తూ ఉంటుంది. అంటే.. మన దగ్గర అంత టెక్నాలజీ లేకనా..? లేక మన వస్తువులపై అంత నమ్మకం లేకనా..? అంటే ఏదీ చెప్పలేం. ముఖ్యంగా ఇద్దరి వ్యాపారుల మధ్య పోటీతత్వం ఉండడం కామన్‌. అయితే.. ఒక కంపెనీని తొక్కిపెట్టాలని వాటి మీద వ్యతిరేక ప్రచారానికి దిగుతుంటాయి. అయితే.. ఇప్పుడు ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్‌ల మధ్య పోటీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో తయారైన వ్యాక్సిన్‌పైనా ప్రజలకు నమ్మకం కలగడం లేదా..? మేడిన్‌ ఇండియా అంటేనే పనికి మాలినవి అని పైస్థాయి వాళ్లు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తుంటారు. దీంతో ప్రజలు విదేశీ మోజులోనే ఉండిపోయారు. అంతేకాదు.. మన దేశీయ వ్యాక్సిన్‌పై అప్పుడే బడా వ్యాపారులు నెగెటివ్‌ ప్రచారాలు ప్రారంభించారు.

    Also Read: ఇండియాలో కరోనా అందుకే తగ్గుముఖం పట్టిందా..?

    ప్రపంచంలో 120కిపైగా దేశాలకు వివిధ రకాల టీకాలు ఎగుమతి చేస్తూ.. బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదిగిన భారత్ బయోటెక్‌ను.. భారతీయులే నమ్మకుండా చేసేందుకు బడా కుట్రను చేసేశారు. ఆక్స్‌ఫర్డ్ – అస్ట్రాజెనెకా అనే యూకే సంస్థలు కలిసి తయారు చేసిన టీకాను ఇండియాలో అమ్ముకునేందుకు సీరమ్ సంస్థ ఓనర్లు ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. నిన్నామొన్నటి వరకూ ఎవరికీ తెలియని.. ఎలాంటి గొప్ప బ్యాక్ గ్రౌండ్ లేని సీరమ్.. ఆక్స్ ఫర్డ్ టీకాను ఇండియాలో మార్కెట్ చేసుకునేందుకు హక్కులు పొంది.. అదే తమ ఘనతగా చెలరేగిపోతోంది. రాత్రికి రాత్రి కుబేరులైపోదామని భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకాపై బురద చల్లడం ప్రారంభించింది. అది నీటితో సమానమని చెప్పడం ప్రారంభించింది.

    నిజానికి ఆక్స్ ఫర్డ్ టీకాలు ప్రయోగదశలో ఎన్నో సైడ్ ఎఫెక్టులు బయటపడ్డాయి. వాటిపై తర్వాత ఏం చేశారో స్పష్టత లేదు. కానీ.. వాటికి అత్యవసర అనుమతిని కేంద్రం ఇచ్చేసింది. ఒక రోజు తర్వాత భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకాకు కూడా అత్యవసర అనుమతి లభించింది. వెంటనే ఆక్స్ ఫర్డ్ టీకాను ఇండియాలో అమ్ముకుంటున్న సీరమ్ సంస్థ.. తమకు పోటీ వచ్చిందని తెగ కంగారు పడిపోయింది. పైగా కేంద్రం మేడిన్ ఇండియా టీకాలే భారత్ కు సప్లయ్ చేస్తామని ఆత్మ నిర్భర్ టీకా అని గొప్పగా చెబుతుండటంతో తమకు టీకాల పేరుతో ప్రజల్ని దోచుకునే అవకాశం పోతుందని ఆందోళన చెందినట్లుగా ఉంది. అందుకే.. తమ కంపెనీ ఫైజర్ లాంటి విదేశీ కంపెనీలు రూపొందించిన టీకాలు తప్ప మిగిలిన వ్యాక్సిన్లన్నీ నీళ్లతో సమానమని సీరమ్ సంస్థ ప్రచారం ప్రారంభించింది.

    Also Read: బర్డ్‌ ఫ్లూ కలకలం

    సీరమ్‌ సంస్థ ప్రచారంతో భారత్ బయోటెక్ తీవ్రంగా స్పందించింది. అసలు సీరమ్ సంస్థ వైద్య రంగంలో సాధించిన విజయాలేమిటో భారత్ బయోటెక్ సాధించిన విజయాలేమిటో మీడియా ముందు పెట్టింది. తమ ట్రయల్స్ డేటాను వెల్లడించింది. అదే సమయంలో ఆస్ట్రాజెనెకా- ఆక్స్ ఫర్డ్ ట్రయల్స్ డేటాలోని లోపాలనూ ఎత్తి చూపింది. నిజానికి ఇలా చేయకూడదు. కానీ.. వారి టీకాను ప్రమోట్ చేయడానికి.. తమ టీకాను నీళ్లతో పోల్చిన దాన్ని తిప్పి కొట్టడానికి భారత్ బయోటెక్ అలా చేయక తప్పలేదు. సీరమ్ సంస్థ.. టీకాల మార్కెటింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించడానికి సిద్ధమయిందని ఇప్పటికే అనేక రకరకాల కథనాలు వచ్చాయి. ప్రభుత్వానికి రూ. 200 ఇచ్చి.. ప్రజలకు రూ.వెయ్యి నుంచి రెండు వేలకు టీకా అమ్మడానికి రంగం సిద్ధం చేసుకుంది. భారత్ బయోటెక్ కూడా పోటీకి వస్తే తమ ఆదాయానికి గండి పడుతుందని ఆందోళన చెంది ఇప్పుడు స్వదేశీ టీకాపై దుష్ప్రచారం మొదలు పెట్టింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్