
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం ఇప్పటికే అనేక రకాలుగా పలుమార్లు బజారున పడింది. అయినా, సినిమా వాళ్ళు మాత్రం ప్రతి ఎన్నికల్లో రచ్చకు దిగుతూనే ఉన్నారు. మా అధ్యక్షుడిగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ బరిలో దిగబోతున్నాను అని తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సగర్వంగా చాటి చెప్పాడు.
సరే, ప్రకాశ్ రాజ్ గొప్ప నటుడు, పైగా పలు సేవా కార్యక్రమాలు చేసిన గతం కూడా ఆయనకు ఉంది. మరి ఇలాంటి ప్రకాశ్ రాజ్ కు పోటీగా బరిలోకి దిగాల్సిన అవసరం ఏముంది ? కానీ మంచు విష్ణు పోటీకి దిగడానికి కసరత్తులు చేస్తున్నాడు. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు, గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పార్టీల మధ్య జరిగే ఎన్నికలను తలపించడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం.
ఈ ఎన్నికలు కారణంగా తెలుగు సినీ పరిశ్రమ రెండు ప్యానెల్స్ గా విడిపోయి హోరాహోరీగా పోటీ పడి, ఆ పోటీలో పుట్టిన ఆరాటంతో ఒకరి పై ఒకరు పోరాటం చేసి గొడవలు విమర్శలు వరకు వెళ్లడం అలవాటు అయిపోయింది. గత మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలలో ు నరేష్ – శివాజీరాజీ ప్యానల్స్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోటీ వల్ల వర్గాలుగా కూడా విడిపోయారు.
అసలు ఎందుకు ‘మా’లో మళ్లీ లొల్లీ మొదలైంది ? కారణం.. ‘మా’లో నిధులు విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయనేది ఎంతోమంది వాదన. ఈ విషయాల పైనే గతంలో వైస్ ప్రెసిడెంట్ గా ఎస్. వి. కృష్ణారెడ్డి అసంతృప్తిని కూడా వ్యక్తం చేసారు. ఆయన తన పదవికి రాజీనామా చేసే వరకూ వెళ్లారు. ఈ సారి తానూ గెలిస్తే, నిధులు మళ్లించడం వంటివి ఉండవు అంటున్నాడు ప్రకాష్ రాజ్.
మరి ఈసారి జరగనున్న ఎన్నికల రంగంలోకి హఠాత్తుగా హీరో మంచు విష్ణు రావడమే అందర్నీ షాక్ కి గురి చేసింది. మంచు విష్ణు రాజకీయపరంగా వైఎస్సార్సీపీకి అనుకూలుడు, మద్దతు పరుడు. మరి ఈ రాజీయం కూడా మా ఎన్నికల్లో కనిపిస్తే మళ్ళీ విమర్శలు మొదలవడం ఖాయం.