
వివేకా హత్య కేసులో విచారణ జరిపించేందుకు మరోసారి సీబీఐ టీం పులివెందుకు చేరుకుంది. విచారణ ప్రారంభించడానికి కొత్త టీం వస్తున్నట్లుగా ఉన్నత స్థాయి వ్యక్తులకు సమాచారం లేదు. కడపకు చేరుకునే రెండు మూడు గంటల ముందు మాత్రమే అధికారులకు సమాచారం వచ్చింది. నిజానికి సీబీఐ అధికారుల విచారణపై నమ్మకం కోల్పోయారు. స్వయంగా వైఎస్ వివేకా కుమార్తె సునీత ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిసి ప్రెస్ మీట్ పెట్టి కడపలో అలాంటి హత్యలు మామూలేనన్నట్లుగా మాట్లాడారు.
హైకోర్టు సీబీఐ విచారణకు అప్పగించిన తర్వాత సీబీఐ అధికారులు ఏదో ఒకటి చేస్తున్నామని అనిపించడానికి మాత్రమే విచారణ జరుపుతున్నారు. గత సీబీఐ అధికారుల విచారణ తీరు చూసి ఒక్క పులివెందులవాసులే కాదు రాష్ర్టం మొత్తం ముక్కున వేలేసుకుంది. వివేకా హత్య కేసులో ఎన్నో క్లూలు ఉన్నాయి. సాక్ష్యాలు తుడిచేయడానికే ప్రయత్నించిన వారే మొదటి అనుమానితులు. హత్యన దాచి పెట్టడానికి ప్రయత్నించిన వారికి మొత్తం తెలిసే ఉంటుంది. మొదట గుండె పోటు అని నమ్మించడానికి ప్రయత్నాలు జరిగాయి. జగన్ కు చెందిన సాక్షి మీడియా గుండెపోటుతో మరణించారని ప్రకటించింది.
శవం పోస్టుమార్టానికి వెళ్లేవరకు ఎవరూ ఆయనది హత్య అని అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఈ లోపే సాక్ష్యాలు తుడిచేయడం, వివేకా గాయాలు కనిపించకుండా కట్టు కట్టడం లాంటివి చాలా చేశారు. హత్యను దాచిపెట్టి సాక్ష్యాలను తారుమారు చేసి స్మూత్ గా అంత్యక్రియలు జరిపించారు. వివేకాను అత్యంత దారుణంగా నరికేశారని తెలుస్తోంది. అయినప్పటికి సీబీఐ అధికారులు ఎవరిని ప్రశ్నించకుండా సాక్ష్యాలను మాయం చేసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించానుకున్న వారిని మాత్రం ప్రశ్నించలేదు.
వ్యవస్థకు అధిపతి ఎలా ఉంటారో ఆ వ్యవస్థ కూడా అలాగే పని చేస్తుంది. ప్రస్తుత సీబీఐ చీఫ్ బిశ్వాల్ పై దేశం మొత్తం అనేక ఆశలు పెట్టుకుంది. ఆ వ్యవస్థ సమర్థంగా పని చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎంతో మంది దోపిడీదారులు హంతకులు అవినీతి పరుు జైలుకు వెళ్లారు. దాని కోసం అంతా ఎదురు చూస్తున్నారు.