
Andhra Pradesh: ఏపీలో కులరాజకీయాలు ఎక్కువే. మొదటి నుంచి ప్రతీవర్గం వారు తమకు పాలనలో సుపరిచిత స్థానం కల్పించాలని కోరుకుంటున్నవారే. అధికారంలోకి వచ్చిన ప్రతీ పార్టీ ఎంతోకొంత కుల రాజకీయాన్ని వాడుకుని వచ్చినవే. అయితే కొన్నాళ్లుగా రెడ్డి.. కాపు పోరు సాగుతోంది. ఇందులో కమ్మ వర్గాన్ని కూడా కలిపారు. అయితే ఈ కులపోరు ప్రస్తుతం ఏపీ నుంచి నేరుగా హైదరాబాద్ మా అసోసియేషన్ వరకు వెళ్లింది. అక్కడ ఓ కీలక కాపు వర్గానికి చెందిన వ్యక్తికి చెక్ పెట్టేందుకు ఏపీ సీఎం నేరుగా రంగంలోకి దిగారన్న సమాచారం. ప్రస్తుతం ఏపీలో వ్యతిరేకంగా ఉన్న వర్గానికి చెందిన వ్యక్తితో టాలీవుడ్ ఇండస్ట్రీలో చెక్ పెట్టారన్న వాదన వినిపిస్తోంది.
ఏపీ(Andhra Pradesh)లో రెడ్డి.. కమ్మ సామాజిక వర్గాలకు మొదటి నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాపు వర్గాన్ని మధ్యలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కాపు.. కమ్మ ఒక్కటై ఏపీలో రెడ్ల ఆధిపత్యంపై పోరాటం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కొంత కీరోల్ వహించినట్లు సమాచారం. ఇటీవల ఏపీలో జరిగిన సమీకరణలు… తరువాత జరిగిన పరిణామాలు.. ఏపీ ప్రభుత్వ అధినేతను కొంతలో కొంత భయపడేలా చేశాయి. దీంతో వెనక నుంచి రంగంలోకి దిగిన సీఎం జగన్ కాపు వర్గానికి కీలకంగా వ్యవహరించే మెగాస్టార్ ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నాడు. ఈ క్రమంలో మంచువారి ఫ్యామిలీతో మా పోరులో నిలిచేలా చేశాడు. అవతలి పక్క నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా తగ్గకుండా మంచు ఫ్యామిలీవారు విజయం సాధించారు. తరువాత మీడియా ముందుకు వచ్చిన మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అవి చాలా సంచలనంగా మారాయి.
అయితే ఏపీ రాజకీయాలకు.. సినిమా ఇండస్ట్రీకి ఏంటి సంబంధమని పలువురు అనుకుంటుండగా.. సినిమా ఇండస్ర్టీ తెలంగాణలోనే ఉన్నా.. ఏపీ రాజకీయాలు తెరవెనుక నుంచి చాలా నడిచాయని అంటున్నారు. మరికొందరేమో.. ఏపీ రాజకీయాలకు సినిమాకు ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో వర్గపోరును ఇండస్ర్టీకి రుద్దొద్దని పలువురు అంటుండగా.. ప్రస్తుతం ఏపీ గొడవల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కుల, వర్గ, లోకల్ .. నాన్ లోకల్ పేరును బాగా వాడుకున్నారని పలువురు అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారని కొందరు అంటుండగా.. చిరంజీవిని దగ్గర చేసుకునే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం.