https://oktelugu.com/

‘కుల’కలం.. ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్

ఏపీలో రెండు బలమైన సామాజికవర్గాలైన కమ్మ, రెడ్డిల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ, వైసీపీ నేతలు ఇప్పుడు కులాన్ని బేస్ చేసుకొని తగువులాడుకుంటున్నారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేశ్ ఆస్పత్రి యజమానులు కమ్మలు కావడం.. టీడీపీ మౌనంగా ఉండడం.. వైసీపీ కక్షసాధింపులతో ఈ ఫైట్ ముదురుతోంది. Also Read: మరో మెట్టు ఎక్కిన ఎంపీ రాజు..! ఇంత ధైర్యం ఎక్కడిది? స్వర్ణ ప్యాలెస్ ఇష్యూలో హీరో రామ్ ట్వీట్లు […]

Written By: , Updated On : August 23, 2020 / 10:15 AM IST
Follow us on


ఏపీలో రెండు బలమైన సామాజికవర్గాలైన కమ్మ, రెడ్డిల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ, వైసీపీ నేతలు ఇప్పుడు కులాన్ని బేస్ చేసుకొని తగువులాడుకుంటున్నారు. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో రమేశ్ ఆస్పత్రి యజమానులు కమ్మలు కావడం.. టీడీపీ మౌనంగా ఉండడం.. వైసీపీ కక్షసాధింపులతో ఈ ఫైట్ ముదురుతోంది.

Also Read: మరో మెట్టు ఎక్కిన ఎంపీ రాజు..! ఇంత ధైర్యం ఎక్కడిది?

స్వర్ణ ప్యాలెస్ ఇష్యూలో హీరో రామ్ ట్వీట్లు చేయడంతో అది మరింత అగ్నికి ఆజ్యంపోసింది. విజయవాడ సీపీ అయితే హీరో రామ్ కు ఆధారాలుంటే చూపించాలని.. లేకుంటే మీకు నోటీసులు జారీ చేస్తామని.. సోషల్ మీడియాలో ఏది పడితే అది వ్యాఖ్యలు చేయడం సరికాదని సవాల్ చేయడం హీట్ పెంచింది. ప్రశ్నించిన హీరో రామ్ ను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆయన తరుఫున వకాల్తా పుచ్చుకోవడంతో ఇది కుల రాజకీయంగా మారిపోయింది.

స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం చుట్టూ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ విడిపోయాయి. రెండు బలమైన సామాజికవర్గాల మధ్య వివాదంగా మారిపోయింది. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తాజాగా దీనిపై స్పందిస్తూ హీరో రామ్ కు మద్దతు పలికారు. విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రియల్ లైఫ్ హీరో అనిపించుకోవాలంటూ హీరో రామ్ ను ఆహ్వానించారు. డాక్టర్ రమేశ్ ను కూడా తప్పు చేయనప్పుడు బయటకు వచ్చి నిరూపించుకోవాలని కోరారు. హీరో రామ్ కు నోటీసులిస్తామన్న సీపీ వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఖండించారు. రాక్షసుల పాలనలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదా? అని మండిపడ్డారు. విజయవాడకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని ఎంతమందిని అరెస్ట్ చేస్తారో మేమూ చూస్తాం.. టీడీపీ తరుఫున అండగా ఉంటామని అని సవాల్ చేశారు.

Also Read: ట్యాపింగ్‌ కేసులో పెద్ద తలలు?

ఇక టీడీపీ సవాల్ పై ఆ పార్టీ నుంచే బయటకు వచ్చిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు సినీ హీరో రామ్ విజయవాడ రమేశ్ ఆసుపత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడని.. రామ్ సినిమాలు ఒక్క కమ్మ వాళ్లు మాత్రమే చూస్తారా? వేరే వాళ్లు చూడరా..? వేరే కులం వారిని సినిమాలు చూడొద్దని రామ్ ని చెప్పమనండి’ అంటూ వంశీ తనదైన శైలిలో టాలీవుడ్ హీరోకు ప్రశ్నల వర్షం కురిపించారు.చంద్రబాబు కూడా ఇదే కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. కమ్మవారికి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపిందా అంటూ జగన్ ను వెనకేసుకొచ్చారు.

ఇప్పుడు స్వర్ణ ప్యాలెస్ వివాదం చుట్టూ రెండు సామాజికవర్గాలు పట్టుదలగా ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో అనవసరంగా స్పందించిన హీరో రామ్ ఇప్పుడు ఈ వివాదంలోకి లాగేయబడ్డారు. ఆయనను విజయవాడకు రమ్మంటూ టీడీపీ మద్దతిస్తుండగా.. ఆయన రాకను వ్యతిరేకిస్తూ వైసీపీ రాజకీయం చేస్తోంది. రెండు సామాజికవర్గాలు ఇలా తప్పు ఒప్పులను ఆలోచించకుండా తగువులు ఆడుకోవడం చర్చనీయాంశమైంది.