Minister KTR On Hyderabad IKEA: అగ్రరాజ్యం అమెరికాలో ఇతర దేశీయులపై ఇప్పటికీ జాత్యాంహకార దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల రెస్టారెంట్ కు వెళ్లిన భారతీయ మహిళపై అక్కడి అమెరికన్ లేడీ దాడి కూడా చేసి తిట్టిపోసింది. మన దేశంలో ఇప్పటివరకూ అలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. కానీ హైదరాబాద్ లో తాజాగా అలాంటి ఘటనే వెలుగుచూసింది.
హైదరాబాద్ లోని ఐకియాలో మణిపూర్ మహిళకు తీవ్ర అవమానం జరిగింది. మణిపూర్ మహిళను భద్రతా సిబ్బంది తనిఖీల పేరుతో ఇబ్బందిపెట్టారు. చెకింగ్ కోసం అరగంట పాటు నిర్బంధించడం సంచలనమైంది. ఈ విషయంపై మహిళ భర్త సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో దుమారం రేగింది. తన భార్య ముందున్న ఎవరినీ ఆపలేదని..కానీ తన భార్యను మాత్రమే తనిఖీల పేరిట ఆపారని నిర్బంధించాలరని ఆరోపించారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఐకియా సిబ్బంది ఆ మహిళకు క్షమాపణలు చెప్పేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో సిబ్బందికి నేర్పించాలని ఐకియాకు షాక్ ఇచ్చేలా ఆదేశించారు.
దీనికి ఐకియా ఇండియా వెంటనే స్పందించింది. జాతి దురహంకార భావన ఏ రూపంలో ఉన్న సహించబోమని.. ఆ మహిళకు ఐకియా క్షమాపణ చెప్పింది.
Also Read:Gautam Adani : చరిత్ర సృష్టించిన గౌతం అదానీ: ప్రపంచంలోనే 3వ అత్యంత ధనవంతుడిగా అవతరణ