https://oktelugu.com/

Caste Conspiracy Against Janasena Party : జనసేనపై కులం కుట్ర మొదలైందా?

Caste Conspiracy Against Janasena Party : జనసేనపై కులం కుట్ర జరుగుతోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. రేపు జనసేన ఆవిర్భావ సభ ఓ చరిత్రాత్మకంగా జరగబోతోందని అందరూ ఆశిస్తున్నారు. ఎప్పుడూ లేని ప్రాధాన్యత ఈ సభకు వచ్చిందని అందరూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనపై కులం ముద్ర వేయాలనే కుట్ర జరుగుతోందని జనసైనికులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పటికే బీసీ నాయకుల చేత ఇదేదో కాపు కులస్థుల మీటింగ్ అనే భావన వచ్చేటట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2022 / 03:43 PM IST
    Follow us on

    Caste Conspiracy Against Janasena Party : జనసేనపై కులం కుట్ర జరుగుతోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. రేపు జనసేన ఆవిర్భావ సభ ఓ చరిత్రాత్మకంగా జరగబోతోందని అందరూ ఆశిస్తున్నారు. ఎప్పుడూ లేని ప్రాధాన్యత ఈ సభకు వచ్చిందని అందరూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనపై కులం ముద్ర వేయాలనే కుట్ర జరుగుతోందని జనసైనికులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పటికే బీసీ నాయకుల చేత ఇదేదో కాపు కులస్థుల మీటింగ్ అనే భావన వచ్చేటట్లు కొంతమందితో వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

    Janasena Party

    ఇదేదో ఆశ్చర్యకరమైంది కాదు.. అందరూ ఊహించిందే.. ముఖ్యంగా పీఆర్పీ ఆవిర్భావంలో ఇదేపనిచేసి అప్పుడు వాళ్లు సక్సెస్ అయ్యారు. ఇది బీసీలకు వ్యతిరేకంగా కాపు కులస్థుల పార్టీగా ముద్ర వేసి నాడు దెబ్బతీశారు.

    Also Read: AP Cabinet Expansion: కొడాలి నానిని కొనసాగిస్తారా? మంత్రి పదవి ఉంటుందా? అడ్డంకులివే

    కాకపోతే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కులజాఢ్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన మొదటి నుంచి కులం కార్డు ముద్రపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. కులం కార్డుతో కార్యక్రమాలు నడపలేదు. అవకాశం వచ్చినప్పుడు కూడా కులం ప్రతినిధిగా కాకుండా అందరికీ సంబంధించిన వారికి చెందిన వ్యక్తిగానే ప్రవర్తిస్తూ వచ్చాడు.

    Also Read: Janasena: జనసేనకు ఊపు.. ఆవిర్భావ వేడుక వేళ పెద్ద ఎత్తున నేతల చేరిక

    ఇప్పటికే పీఆర్పీని ఎలా కుట్రలు, కుతంత్రాలతో పార్టీని లేకుండా చేశారు.ఈసారి అటువంటి ప్రయత్నాలు మళ్లీ జరుగుతున్నాయి. జనసేనను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పవన్ విషయంలో జనం నమ్మరని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా కులం కార్డు ఉపయోగించలేదు. సహజంగానే కాపు కులస్థులు పవన్ సక్సెస్ కావాలనే కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే జనసేనపై కుటం కుట్ర మొదలైందా? ఏపీ రాజకీయ పరిణామాలు ఎలా జరుగుతోందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.