Capital Infra Trust InvIT : ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) లిస్టింగ్ కోసం సన్నాహాలు 2024 సంవత్సరానికి ముందే ప్రారంభమయ్యాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి పెట్టే ఇన్విట్ కంపెనీ అయిన క్యాపిటల్ ఇన్‌ఫ్రా ట్రస్ట్ ఇన్విట్ ఐపీవో జనవరి 7న తెరవబడుతుంది. ఇందులో పెట్టుబడిదారులు జనవరి 9 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ఐపీఓ ధర యూనిట్‌కు రూ.99 నుంచి రూ.100గా నిర్ణయించారు.
దీని యూనిట్లు BSE, NSEలలో లిస్ట్ చేయబడుతాయి. ఈ IPO విలువ రూ.1,578 కోట్లు. ఇది కాకుండా, ఇప్పటికే ఉన్న వాటాదారులు తమ వాటాను కూడా OFS(ఆఫర్ ఫర్ సేల్) విండో ద్వారా విక్రయిస్తారు. మొత్తం ఇష్యూలో రూ. 1,077 కోట్ల విలువైన కొత్త షేర్లు ఉండగా, రూ. 501 కోట్ల విలువైన ఓఎఫ్‌ఏ ఉన్నాయి. ఈ IPOలో పెట్టుబడిదారులు 150 షేర్లలో డబ్బును పెట్టుబడి పెట్టగలరు. ఐపీవో ఎగువ ధర బ్యాండ్ 100 ప్రకారం 1 లాట్ కోసం దరఖాస్తు చేస్తే, దీని కోసం రూ. 15,000 పెట్టుబడి పెట్టాలి. ఈ ఐపీవో రిజిస్ట్రార్ Kfin Tech.
జనవరి 14న లిస్టింగ్
ఐపీవోలో 75 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు (QIB),25 శాతం నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII) రిజర్వ్ చేయబడింది. జనవరి 10న ఐపీఓ కింద యూనిట్ల కేటాయింపు ఫైనల్ అవుతుంది. జనవరి 14న, కంపెనీ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో లిస్ట్ చేయబడతాయి.
కంపెనీ ఏమి చేస్తుంది
క్యాపిటల్ ఇన్‌ఫ్రా ట్రస్ట్, సెప్టెంబర్ 2023లో స్థాపించబడింది. ఇది గవార్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ స్పాన్సర్ చేసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్. ఇది NHAI, MORTH, MMRDA, CPWDతో సహా అనేక ప్రభుత్వ సంస్థల కోసం 19 రాష్ట్రాలలో రోడ్డు, హైవే ప్రాజెక్టులపై పనిచేస్తుంది.
ఇన్విట్ అంటే ఏమిటి?
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు ఒక విధంగా మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. రోడ్లు, పవర్ ప్లాంట్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు, పైప్‌లైన్‌లు మొదలైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఇన్విట్ పెట్టుబడి పెడుతుంది. సామాన్యులు, సంస్థలు చిన్న మూలధనంతో కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.