అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకని జగన్?

ఏపీ సీఎం జగన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకడం లేదు. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులకు మాత్రం ఇస్తున్నారు. రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలతో సమావేశం అయ్యారు. పలువురు కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా తాజాగా అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఈ ఫొటోలన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే జగన్ కు మాత్రం ఎందుకు అపాయింట్ మెంట్ […]

Written By: Srinivas, Updated On : June 8, 2021 7:33 pm
Follow us on

ఏపీ సీఎం జగన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకడం లేదు. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులకు మాత్రం ఇస్తున్నారు. రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలతో సమావేశం అయ్యారు. పలువురు కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా తాజాగా అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఈ ఫొటోలన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే జగన్ కు మాత్రం ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం అపాయింట్ మెంట్ ఖరారు అయిందని పీఎంవోకు సమాచారం వచ్చినా చివరి క్షణంలో మళ్లీ వాయిదా వేశారు. గురువారం లోపు ఇస్తామని సమాచారం పంపారు. ఆ తర్వాత కేంద్రం వైపు నుంచి ఎలాంటి సమాచారం లేదు.

దీంతో గురువారం కూడా అమిత్ షాతో అపాయింట్ మెంట్ ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. సహజంగానే ఇది వైసీపీ నేతలకు ఇబ్బందికర పరిణామం. అమిత్ షా బిజీగా ఉండి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఏదో కారణంతో అవాయిడ్ చేస్తున్నారన్న అభిప్రాయం బలంగా కలగడానికి కారణం అవుతోంది

రాష్ర్టానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడటానికి అయితే ఎప్పుడైనా సమయం ఇస్తారని కానీ అమిత్ షాను జగన్ ఇతర కారణాలతో కలవాలనుకుంటున్నారని ఆ అజెండా తెలిసినందునే పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. అపాయింట్ మెంట్లు ఇవ్వకపోవడం, ఇచ్చినా చివరి క్షణంలో రద్దు చేయడం ఒకవేళ కలిసినా రాత్రి పది తర్వాత జగన్ వెళ్లి కలవడం వంటివి అనేక విమర్శలకు కారణం అవుతున్నాయి.