Canada Vs India: కెనడా అధ్యక్షుడు ట్రూడో నెత్తి మాసిన వ్యాఖ్యల వెనుక అసలు అంతరార్థం ఇదీ..

కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ లో మొత్తం 338 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి 157 స్థానాలు వచ్చాయి. ప్రత్యర్థి కన్జర్వేటివ్ పార్టీకి 121 సీట్లు, బ్లాక్ క్యూబో కోయిస్ 32, న్యూ డెమోక్రటిక్ పార్టీ 24 సీట్లు గెలుచుకున్నాయి.

Written By: Bhaskar, Updated On : September 22, 2023 9:47 am

Canada Vs India

Follow us on

Canada Vs India: కెనడా ప్రధానమంత్రి ట్రూడో చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యల ఫలితం.. కెనడా, భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆరోపణలు, ప్రఖ్యారోపణలు చేసుకునే దశ దాటిపోయి దౌత్యాధికారులను పరస్పరం బహిష్కరించుకునే దాకా వెళ్ళిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీని అంతటికి కారణం సిక్కు ఉగ్రవాద సంస్థ ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్(45) హత్యకు గురి కావడమే. ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం సర్రే లో ఒక గురుద్వారా బయట హర్దీప్ ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కెనడా నుంచి పనిచేస్తున్న కేటీఎఫ్ ను భారత ప్రభుత్వం గతంలోనే నిషేధించింది. హార్దీప్ ను కరుడుగట్టిన ఉగ్రవాదిగా పేర్కొంటూ అతని తలపై పది లక్షల రివార్డు ప్రకటించింది.

అయితే ట్రూడో ఖలిస్థానీ మద్దతు కూడగట్టుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. కెనడా దేశ వ్యాప్తంగా ఆయనకు ప్రజాదరణ క్షీణించడంతో పాటు మైనారిటీ ప్రభుత్వంలో తన స్థానాన్ని పరిచయం చేసుకోవడానికి ఇప్పటికే ఆయన నానా పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆయన పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజా సర్వే ప్రకారం గత 55 సంవత్సరాల లో ట్రూడో ను అత్యంత చెత్త ప్రధానిగా 30 శాతం మంది కెనడియన్లు భావిస్తున్నారు. కెనడా యువత లిబరల్ పార్టీ కంటే కన్జర్వేటివ్ పార్టీ వైపే మొగ్గు చూపుతోంది. ఈ నెలలో ట్రూడో అసమతి రేటింగ్ 63 శాతానికి చేరిందని సంస్థ అంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది.

కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ లో మొత్తం 338 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి 157 స్థానాలు వచ్చాయి. ప్రత్యర్థి కన్జర్వేటివ్ పార్టీకి 121 సీట్లు, బ్లాక్ క్యూబో కోయిస్ 32, న్యూ డెమోక్రటిక్ పార్టీ 24 సీట్లు గెలుచుకున్నాయి. ప్రతిపక్షం కంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవి చాలకపోవడంతో మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో ఎన్డీపి నేత జగ్మిత్ సింగ్ ప్రభుత్వ ఏర్పాట్లు కీలకపాత్ర పోషించారు.. ఖలిస్థానీ వేర్పాటు వాదానికి మద్దతు దారు అయిన ఎన్ డీ పీ సహకారంతో ట్రూడో అధికార పగ్గాలు చేపట్టారు. ట్రూడో పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పొయిలీవ్రే ప్రధాని అవుతారని అక్కడి సర్వేలు చెబుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డిపి సహకారం అవసరమని లిబరల్ పార్టీ భావిస్తోంది. అందుకే నిజ్జర్ హత్య కేసు పై ట్రూడో ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తున్నది.