పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలతో పాటే ఇప్పుడు రాజకీయాల్లోనూ బిజీ అయిపోయారు. గత ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన ఆయన.. ఆయన పార్టీ పెద్ద ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఇప్పుడు పవన్ రాజకీయం చూస్తున్న వారికి ఎవరికైనా అంతా భ్రాంతియేనా అని అనుకుంటున్నారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కు .. రాజకీయాలు అంతగా కలిసిరావడం లేదా అని చెవులు కొరుక్కుంటున్నారు.
Also Read: తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? బలమెంత?
దీనికితోడు ఈ మధ్య పవన్ బీజేపీతో జతకట్టాడు. అప్పటి నుంచి నోరు కట్టేసుకొని కూర్చున్నాడు అనేది బహిరంగ రహస్యం. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీలో పంజరంలో చిక్కుకొని స్వేచ్ఛ కోల్పోయాడు. ఆయన ఒకప్పుడు బీజేపీని తిట్టిన తిట్లకు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకు అసలు పొంతన లేదు. ఆయన పాలిటిక్స్‌లో సాధించింది ఈ విద్యే. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓ సందర్భంలో ముఖ్యమంత్రి కాకుండా తనను ఎవరూ ఆపలేరు. కానీ.. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయాడు. జనసేన తరపున ఒకే ఒక్క అభ్యర్థి గెలవగానే సంతోషపడిపోయాడు.
కానీ.. మొదట్లోనే పవన్‌కు హ్యాండ్ ఇచ్చి జగన్‌కు జై కొట్టాడు. రాపాక వరప్రసాద్ పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలలో ఒకడిగా ఉన్నాడు. తాను రెండు స్థానాల్లో ఓడిపోవడం మొదటి నిరాశ అయితే, రాపాక చేజారిపోవడం రెండో నిరాశ. బీజేపీతో జతకట్టి ఏమీ మాట్లాడలేకపోవడం మూడో నిరాశ. ఆ మధ్య జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడి పాపం అభ్యర్థులను కూడా డిసైడ్ చేశాడు. కానీ.. బీజీపీ అడ్డుకట్ట వేసింది. ఈ విషయంలో పవన్‌కు నిరాశ కలిగినా బీజేపీ పోటీ చేయడమే మంచిదైందేమో. టీఆర్‌ఎస్ అహంకారం మీద దెబ్బకొట్టింది. జనసేన పోటీ చేసి ఉంటే ఆ స్థాయిలో సీట్లు వచ్చేవో కాదో. తిరుపతిలో పోటీ చేసే అవకాశం ఇస్తామని మాట ఇచ్చి పవన్‌ను శాంతింపచేశారు. కానీ.. ఇప్పుడు అక్కడా నిరాశే ఎదురైంది.
Also Read: బైడెన్ నిర్ణయం.. వారికెంతో ఊరట
తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేది తామేనని హరిహర వీరమల్లు స్థాయిలో ప్రతిజ్ఞ చేసిన పవన్ కల్యాణ్.. ఢిల్లీకి వెళ్లి బీజేపీ హైకమాండ్‌తోనూ తలపడినంత పనిచేశాడు. స్నేహం కోసం తాను చేసిన త్యాగాలకు గుర్తుగా తిరుపతిలో పోటీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాడు. కానీ.. జనసేనానికి మళ్లీ నిరాశే ఎదురైంది. ఏపీలో మిత్రులుగా కొనసాగుతున్న బీజేపీ, జనసేన ఈ సీటులో పోటీ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. పోటీలో ఉండేది తామంటే తామేనంటూ రెండు పార్టీల అధ్యక్షులూ పోటాపోటీ ప్రకటనలు ఇచ్చారు. చివరికి ఢిల్లీలో జరిగిన పంచాయితీలో.. ఎవరు పోటీ చేయాలనేదానిపై ఓ జాయింట్ కమిటీ ఏర్పాటైంది. రెండు నెలల సుదీర్ఘ మంతనాల తర్వాత కమిటీ ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీనే బరిలోకి దిగాలని, వారికి జనసేన మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నాయి. దీనిపై ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు జనసేనాని పవన్ కల్యాణ్ తో తుది భేటీ నిర్వహించిన అనంతరం తిరుపతి సీటుపై మీడియాకు స్పష్టత ఇచ్చారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్