KCR vs BJP: కేసీఆర్.. బీజేపీని ఓడించగలడా?

KCR vs BJP: వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ వాదాన్ని తుదముట్టించాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి లాగేశాడు. టీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా కుదించాడు. కానీ ఆయన మరణంతో కథ మారింది. కేసీఆర్ లోని నివురుగప్పిన ఉద్యమం పైకి తెలంగాణ వచ్చేవరకూ సాగింది. సెంటిమెంట్ ను రగిలించడంలో దాన్ని అంతే తీవ్రంగా మండించడంలో కేసీఆర్ ను మించిన రాజకీయ చాణక్యుడు లేడు. మొదట రాష్ట్రం రాగానే కాంగ్రెస్ కంటే ఉద్యమపార్టీ తమకే తెలంగాణ కష్టాలు […]

Written By: NARESH, Updated On : December 18, 2021 7:36 pm
Follow us on

KCR vs BJP: వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ వాదాన్ని తుదముట్టించాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి లాగేశాడు. టీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా కుదించాడు. కానీ ఆయన మరణంతో కథ మారింది. కేసీఆర్ లోని నివురుగప్పిన ఉద్యమం పైకి తెలంగాణ వచ్చేవరకూ సాగింది. సెంటిమెంట్ ను రగిలించడంలో దాన్ని అంతే తీవ్రంగా మండించడంలో కేసీఆర్ ను మించిన రాజకీయ చాణక్యుడు లేడు.

KCR vs BJP


మొదట రాష్ట్రం రాగానే కాంగ్రెస్ కంటే ఉద్యమపార్టీ తమకే తెలంగాణ కష్టాలు తెలుసు అని ప్రజల మనసు చూరగొని కేసీఆర్ గెలిచేశాడు. రెండోసారి సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించాడు. టీడీపీతో జట్టుకట్టిన కాంగ్రెస్ ను చంద్రబాబు ఆంధ్ర వారి కిందకు తెలంగాణ పోవాలా? అని సెంటిమెంట్ తో మరోసారి గెలిచాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి టైం వచ్చింది.

Also Read: తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు?

తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ కుదేలైంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీ దూసుకొచ్చింది. ఈసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి ఏం లేదు. దీంతో కేసీఆర్ సరికొత్త అస్త్రాన్ని బయటకు తీశాడు. అదే రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం.. ఇప్పుడు ఇదే ఇష్యూని రగిలించి అంటించి రైతుల సెంటిమెంటుతో రాజకీయం పండించి గెలవడానికి కేసీఆర్ రెడీ అయినట్టుగా ఆయన అడుగులు చూస్తే తెలుస్తోంది.

ధాన్యం కొనుగోలు చేయని కేంద్రాన్ని టీఆర్ఎస్ కార్నర్ చేసింది. తాజాగా నిన్న ‘బీజేపీనే మన ప్రత్యర్థి’ ఆ పార్టీకి చావుడప్పు కొట్టండని కేసీఆర్ సమరశంఖం పూరించాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమేం చేయలేదో అన్నింటిని కేసీఆర్ బయటకు తీయబోతున్నాడట.. ఒక్కో విషయంలో కేంద్రం చేసిన పొరపాట్లను బయటకు తీసి మరీ ఇప్పుడు కడిగేయడానికి కేసీఆర్ రెడీ అవుతున్నాడట.. కేంద్రంపై పోరుతోనే వచ్చే ఎన్నికల్లో గెలుపునకు బాటలు పరుచబోతున్నాడట.. కేసీఆర్ చర్యలు ఊహాతీతం అంటారు. మరి ఆయన రాజకీయ దాడులను బీజేపీ ఎలా కాచుకుంటుందో చూడాలి మరీ

Also Read: టార్గెట్ బీజేపీ.. రైతుబంధుపై కేసీఆర్ క్లారిటీ..