https://oktelugu.com/

అమెరికా చరిత్రలోనే కనీవినీ ఎరగరేమో..!

ఎన్నికల ఫలితాలను నిరసించడం అంటే.. ఏదో వెనుకబడిన దేశాల్లో ఉందంటే అది వేరే. నియంతృత్వానికి కాస్త అటూ ఇటూ ఉండే దేశాల్లో ఇలాంటివి జ‌రుగుతూ ఉంటాయి. ఇప్పటికే ప్రపంచంలో ఇలాంటి దేశాలు బోలెడు ఉన్నాయి. ఎందుకంటే.. అక్కడి దేశ పరిస్థితులు.. అక్కడి రాజకీయాలు అలాంటి పరిస్థితులకు దారితీస్తుంటాయి. అలాంటిది అగ్రరాజ్యం యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాటి సరసన చేరింది. ఎంతో అత్యున్నత పెద్దన్న పాత్రను పోషిస్తూ వస్తున్న ట్రంప్‌ రచ్చతో పరువు మొత్తం పోయినట్లైంది. Also […]

Written By: , Updated On : January 11, 2021 / 10:54 AM IST
Follow us on

Trump
ఎన్నికల ఫలితాలను నిరసించడం అంటే.. ఏదో వెనుకబడిన దేశాల్లో ఉందంటే అది వేరే. నియంతృత్వానికి కాస్త అటూ ఇటూ ఉండే దేశాల్లో ఇలాంటివి జ‌రుగుతూ ఉంటాయి. ఇప్పటికే ప్రపంచంలో ఇలాంటి దేశాలు బోలెడు ఉన్నాయి. ఎందుకంటే.. అక్కడి దేశ పరిస్థితులు.. అక్కడి రాజకీయాలు అలాంటి పరిస్థితులకు దారితీస్తుంటాయి. అలాంటిది అగ్రరాజ్యం యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాటి సరసన చేరింది. ఎంతో అత్యున్నత పెద్దన్న పాత్రను పోషిస్తూ వస్తున్న ట్రంప్‌ రచ్చతో పరువు మొత్తం పోయినట్లైంది.

Also Read: ట్రంప్ నకు ఇక రాజకీయ మరణమేనా?

బ‌హుశా ట్రంప్ తీరును చూస్తే ఇలా చెప్పక తప్పదు. పురాత‌న ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్యానికి నిర్వచ‌నాల‌ను ఇచ్చిన దేశంగా అమెరికాకు పేరుంది. ఆ నేప‌థ్యానికే ట్రంప్ తీవ్ర క‌లంకం తీసుకొచ్చాడు. దీంతో ఆయ‌న‌పై సొంత పార్టీ కూడా గుర్రుగా ఉంద‌ని అంటున్నారు. రిప‌బ్లిక‌న్ పార్టీలో ఇప్పటికీ ట్రంప్ కు మ‌ద్దతుదారులు ఉన్నప్పటికీ.. ట్రంప్ అభిశంస‌న ప్రక్రియ‌లో ఆ పార్టీ కూడా భాగ‌స్వామి అవుతుంద‌నే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: ట్రంప్ నకు షాకిచ్చిన ట్విట్టర్.. శాశ్వత నిషేధం

ట్రంప్‌.. మరో పది రోజుల్లో పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ నేపథ్యంల్ ట్రంప్‌ చేసిన రచ్చతో ఇప్పుడు అభిశంస‌న అంశం చ‌ర్చకు వ‌చ్చింది. ట్రంప్‌ను పీఠం నుంచి దించేసే ప్రక్రియ ఊపందుకున్నట్టుగా వార్తలు వ‌స్తున్నాయి. కొత్తగా అధ్యక్షుడు బాధ్యత‌లు తీసుకోవ‌డానికి మునుపే ట్రంప్ ను దించేస్తార‌నే వార్తలు వ‌స్తున్నాయి. మ‌రి అదే జ‌రిగితే.. అమెరికా త‌న ప‌రువును నిల‌బెట్టుకున్నట్టే అవుతుంది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

అయితే.. రెండు స‌భ‌ల్లోనూ ట్రంప్ అభిశంస‌న తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒక స‌భ‌లో డెమొక్రాట్లు మెజారిటీతో ఉండ‌టంతో అక్కడ ట్రంప్ ను తొల‌గించే తీర్మానం ఆమోదం పొంద‌డం లాంఛ‌న‌మే. రిప‌బ్లిక‌న్ లు మెజారిటీతో ఉన్న స‌భ‌లో ట్రంప్ అభిశంస‌న తీర్మానం ఆమోదం పొందితే అది సంచ‌ల‌న‌మే అవుతుంది. ప‌ది రోజుల ముందో, వారం ముందో.. అయినా ట్రంప్‌ను తొల‌గిస్తే అది అమెరిక‌న్ చ‌రిత్రలోనే ప్రత్యేక అధ్యాయం అవుతుంది.