
రాష్ట్రంలో మద్యనిషేదాన్ని దశల వారీగా అమలు చేస్తామని గత ఎన్నికల్లో ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం నిషేధించే విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శల పాలవుతున్నాయి.
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు మద్యం విక్రయాలు నిలిపి వేశారు. ఈ సమయంలో తెలంగాణా రాష్ట్రంలో మద్యం పానప్రియులకు ఎదురైన తీవ్ర సమస్యలు ఏపీలో నెలకొనలేదు. అయినప్పటికీ హడావుడిగా మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మద్య నిషేధంపై ఉన్న చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా మారింది.
మద్యం విక్రయాలకు అనుమతి విషయం పక్కనపెడితే, మద్యాన్ని ప్రజల నుంచి దూరం చేయడానికి అంటూ తొలి 25 శాతం పెంచారు, మరుసటి రోజు మరో 50 శాతం పెంచారు. ఈ చర్య వల్ల మద్యం తాగేవారి జీవితాలు మరింత దుర్భరంగా మరే పరిస్థితి కనిపిస్తోంది. కరోనాకి మందు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న రోజుల్లో మద్యం అలవాటు ఉన్నవారు వారి సంపాదనలో 30 నుంచి 40 శాతం వరకూ దీని కోసం ఖర్చు పెట్టేవారని ఒక అంచనా. కరోనా వచ్చిన అనంతరం 75 శాతం పెరిగిన మద్యం ధరల కారణంగా సంపాదనలో 60 నుంచి 70 శాతం ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కుటుంబ కనీస అవసరాలు వీరు తీర్చే అవకాశం ఉండదు. ఫలితాలు కుటుంబం మరిన్ని సమస్యలొకి నెట్టివేయబడుతుంది.
జగన్ ప్రభుత్వ అండతోనే ఎల్‌జీ పాలిమర్స్ నిర్లక్ష్యం!
మరోవైపు మద్యం మాన్పించేందుకు షాపుల సంఖ్య తగ్గించామంటూ ప్రభుత్వం చెబుతోంది. ఎప్పటి వరకు రెండు దశల్లో 33 శాతం అంటే 1,446 షాపులు రద్దు చేశామని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలలో భాగంగా మద్యం విక్రయాలు 24.04 శాతం తగాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కలపై విమర్శలు అనేకం ఉన్నాయి. మద్యం కోసం అలవాటు పడినవారు ఎంత దూరంలో ఉన్నా అక్కడి చేరుకుంటారు. ఎన్టీఆర్ ప్రభుత్వం మద్య నిషేధం అమలు చేసిన రోజుల్లోనూ కాపు సారా, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం విచ్చల విడిగా దొరికెవి.
దీనికి తొడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదం విచ్చల విడిగా గుర్తింపు లేని బ్రాండ్ లకు అనుమతి ఇవ్వడం. ఈ మద్యం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. విపక్ష టీడీపీ నేతలు ఈ సంస్థ సీఎం జగన్ సొంత మనుషులవని చెప్పుకొస్తున్నారు. మద్య నిషేధం కోరుకుంటున్న ప్రభుత్వం ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది. ఏ ప్రతి ఫలం లేకుండా ఎన్ని విమర్శలు ఎందుకు ఎదుర్కొంటుంది అనేది ఆలోచించాల్సిన విషయం.
పెరిగిన ధరలను బట్టి ఏడాదికి రూ.30 వేల కోట్లు ఆదాయం మద్యం విక్రయాలు వల్ల లభించే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా లేదు. దీంతో పన్నుల పేరుతో ధరలు పెంచి ఆదాయాన్ని కాపాడుకుంటూ, మద్య నిషేధం చేస్తున్నామని చెప్పుకునేందుకు షాపుల సంఖ్య తగ్గించి, సొంత ఆదాయం కోసం నాసిరకం బ్రాండ్లకు అనుమతి ఇచ్చి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుంది. ఎటువంటి చర్యలతో మద్య నిషేధం ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది.