తమిళ సినీ పరిశ్రమకు తమిళ నాడు ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది కోలీవుడ్ లో లాక్డౌన్ కారణంగా దాదాపు రూ.500 కోట్ల మేర పెట్టుబడులు సినిమా షూటింగ్ అనంతర కార్యక్రమాలు చేసుకొనే వీలులేక అర్ధాంతరంగా ఆగిపోయాయి . దాంతో పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతించాలని కోరుతూ తమిళ నిర్మాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకొన్నారు .దానికి స్పందించిన తమిళ నాడు ప్రభుత్వం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలకు పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో మే 11 నుంచి టీవీ, సినిమాలకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి .
మే 17తర్వాత రోడ్లపైకి బస్సులు..?
కాకపొతే కొన్ని షరతులు విధించడం జరిగింది. ఆ ప్రకారం గరిష్ఠంగా ఐదుగురితో “ఎడిటింగ్, డబ్బింగ్, డీఐ, రీ రికార్డింగ్ సౌండ్ డిజైన్ , మిక్సింగ్ ” పనులు చేసుకోవచ్చని, ” V F X , C G I ” పనుల కోసం గరిష్టంగా 15 మందిని ఉపయోగించుకోవచ్చని పరిమితులు విధించింది.అంతేగాక ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటిని విధిగా పాటించాలని ఆంక్షలు జారీచేసింది .
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Relief to kollywood tn allows post production
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com