Homeఎన్నికలుBJP: బిజెపి మ్యాజిక్ ఫిగర్ దాటగలదా?

BJP: బిజెపి మ్యాజిక్ ఫిగర్ దాటగలదా?

BJP: బిజెపికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా? ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటడం కష్టమా? నాలుగు విడతల్లో పూర్తయిన పోలింగ్లో ఆ పార్టీ వెనుకబడిందా? తక్కువ శాతం ఓట్లు పోలింగ్ కావడం దేనికి సంకేతం? ఇండియన్ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చి నడుస్తోంది. గత ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించిన భారతీయ జనతా పార్టీకి ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. బిజెపి ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం లేదని.. మిత్రపక్షాల అవసరం తప్పనిసరి అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిజెపి మాత్రం ఈ ఎన్నికల్లో ఒంటరిగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లు దక్కించుకోవాలన్న ఆలోచనలో ఉంది. కానీ అది అంత ఈజీ కాదని తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్ పూర్తయింది. జూన్ 1 తో ఏడో దశ పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కనీసం 400 లోక్సభ స్థానాలను లక్ష్యంగా పెట్టుకొని బిజెపి ఎన్నికల్లో గట్టిగానే శ్రమించింది. అయితే సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటి అవకాశం లేదని తెలియడంతో కమలనాధుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల పోలింగ్ లో తక్కువ కూలింగ్ శాతం నమోదయింది. ఇది అధికార పార్టీలో కలవరానికి కారణమవుతోంది. ఏప్రిల్ 19న జరిగిన తొలి దశ పోలింగ్ ను.. గత ఎన్నికలతో పోల్చుకుంటే నాలుగు శాతం ఓటింగ్ తక్కువగా నమోదయింది. అదే నెల 26న జరిగిన రెండో విడత పోలింగ్లో మూడు శాతం తక్కువగానే పోలింగ్ నమోదయింది. మూడో దశలో 1.2%, నాలుగో దశలో 2.3 శాతం ఓటింగ్ తక్కువగా నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో మోడీ గ్రాఫ్ పడిపోయిందన్న సంకేతాలు రావడం బీజేపీకి లోటు.

ప్రస్తుతం బిజెపి కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడానికి గొప్పగా చెప్పుకుంటుంది. దేశవ్యాప్తంగా దానినే ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కానీ కాశ్మీర్లో బిజెపి పోటీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాశ్మీర్ లోక్సభ ఎన్నికల బరిలో ఏ ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా లేకపోవడం రికార్డ్. కాశ్మీర్లో మూడు లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒక్కచోట కూడా బిజెపి పోటీలో పెట్టలేదు. బిజెపి గ్రాఫ్ పడిపోవడం వల్లే అక్కడ పోటీ చేయడం లేదన్న ప్రచారం ఉంది. అయితే కాశ్మీర్ విషయం పక్కన పెడితే.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 272 సీట్లు రావాలి.. కానీ విజయం ముంగిట బిజెపి నిలిచిపోతుందని… అప్పుడు స్నేహితుల మద్దతు కీలకమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ విశ్లేషణలతో కాషాయ దళంలో కలవరం రేగింది. మిగతా మూడు విడతల పోలింగ్ లోనైనా రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైతే.. బిజెపి గట్టెక్కినట్టే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version