https://oktelugu.com/

Asaduddin Owaisi: పాతబస్తీలో ఏదో తేడా కొడుతోందట..అసద్‌లో అందుకే టెన్షన్..!

హైద‌రాబాద్ పార్ల‌మెంట్ సెగ్మెంట్ ప‌రిధిలోని గోషామ‌హ‌ల్‌,కార్వాన్‌లో బీజేపీ బ‌లంగా ఉంది. ఇక్క‌డ యాకుత్‌పురా, చంద్రాయ‌ణ్ గుట్ట‌,మ‌ల‌క్‌పేట్‌,చార్మిన‌ర్ క‌న్న ఎక్కువ పోలింగ్ న‌మోదైంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : May 15, 2024 / 02:07 PM IST

    Asaduddin Owaisi

    Follow us on

    Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి టెన్షన్ పట్టుకుందట..! ఈసారి హైదరాబాద్ ఎంపీ సీటేమైనా చేజారుతోందా..? అనే ఆందోళ‌న‌లో ఉన్నారంటా..! ఈసారి హైద‌రాబాద్ లోక్ స‌భ‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేవ‌లం 46.06 శాత‌మే పోలింగ్ న‌మోదైంది. ఈ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఎంఐఎంకు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లైన చార్మినార్‌,యాకుత్ పురా,చంద్రాయ‌గుట్ట‌ల్లో 42 నుంచి 48 శాతం ఓట్లే ప‌డ్డాయి. అలాగే ప‌తంగికి గ‌ట్టి ప‌ట్టున్న మ‌ల‌క్‌పేట్‌లోనూ ఈసారి ఓటింగ్ శాతం భారీగా త‌గ్గిపోయింది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల‌తో పోల్చితే ఓట్లేసేందుకు ఓట‌ర్లు పెద్ద‌గా ఆస‌క్తిని క‌న‌బ‌ర్చ‌లేదు. అయితే యాకుత్ పురా,చార్మినార్‌, చంద్రాయ‌ణ్ గుట్ట మాదిరే ప‌తంగికి గ‌ట్టి హోల్డ్ ఉన్న మ‌ల‌క్‌పేట్‌లోనూ ఓటింగ్ శాతం త‌గ్గ‌డంపైనే ఆపార్టీ చీఫ్ అస‌ద్ టెన్ష‌న్ ప‌డుతున్నారు.

    హైద‌రాబాద్ పార్ల‌మెంట్ సెగ్మెంట్ ప‌రిధిలోని గోషామ‌హ‌ల్‌,కార్వాన్‌లో బీజేపీ బ‌లంగా ఉంది. ఇక్క‌డ యాకుత్‌పురా, చంద్రాయ‌ణ్ గుట్ట‌,మ‌ల‌క్‌పేట్‌,చార్మిన‌ర్ క‌న్న ఎక్కువ పోలింగ్ న‌మోదైంది. దీంతో పాటు ఎంఐఎంకు ప‌ట్టున్నాయ‌నుకుంటున్న సెగ్మెంట్ల‌లోనూ ఈసారి బీజేపీ అభ్య‌ర్థి మాధ‌వీల‌తా ప్ర‌చారంతో హోరెత్తించారు. ముస్లిం మైనార్టీల‌కు సంబంధించిన ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ..క్యాంపెయిన్‌లో దూసుకుపోయారు. ఈమె దెబ్బ‌కు అస‌దుద్దీన్ కూడా హిందూ దేవాల‌యాల‌కు వ‌చ్చి ద‌ర్శ‌నం చేసుకోవాల్సి వ‌చ్చింది. అందుకే ఈసారి పోల్ మ్యానేజ్ మెంట్‌లో బీజేపీ అభ్య‌ర్థి మాధ‌వీల‌తా స‌క్సెస్ అయిన‌ట్లు అస‌ద్ భావిస్తున్నారు. దీనికి తోడు గోషామ‌హ‌ల్‌, కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటింగ్ శాతం పెర‌గ‌డం కూడా ఓవ‌రాల్‌గా ఎక్క‌డ బీజేపీకి లాభిస్తుందోన‌ని బెంగ అస‌ద్‌ను వెంటాడుతోంది.

    గోషామ‌హ‌ల్‌,కార్వాన్‌ల‌లో 55 శాతం వ‌ర‌కు పోలింగ్ జ‌రిగింది. ఇక్క‌డ మెజార్టీ ఓట్లు బీజేపీకే ప‌డుతాయ‌న‌డంలో ఏ మాత్రం సంకోచం లేదు. ఇక్క‌డి మెజార్టీ ఓట‌ర్లు ఎంఐఎం పేరు చెబితేనే మండిప‌డుతుంటారు. ఈసారి ఈనియోజ‌వ‌ర్గాల్లోని టెంపుల్స్‌ను అస‌దు ద‌ర్శ‌నం చేసుకొని వారి ఓట్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు య‌త్నించారు. అయితే మాధ‌వీల‌తా అస‌దు ప్ర‌య‌త్నాల‌ను వ‌మ్ము చేయ‌డ‌మే కాకుండా ముస్లిం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న సెగ్మెంట్ల‌లోనూ ఆమె త‌న ప్ర‌చారంతో హోరెత్తించారు. దీంతో హైద‌రాబాద్ పార్ల‌మెంట్ దంగ‌ల్ ఆస‌క్తిక‌రంగా మార‌డం..బీజేపీ..ఎంఐఎం మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌ర‌గ‌డంతో..ఏదైనా మిరాకిల్ జ‌రిగి త‌న‌కేమైనా న‌ష్టం జ‌రుగుతుందా..? అనే ఆందోళ‌న‌లో అస‌దుద్దీన్ ఉన్నారంటా..!