Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై జనసేన స్పందించింది. రహదారుల అధ్వాన పరిస్థితిపై ప్రభుత్వానికి సూచించినా పట్టించుకోకపోవడంతో మరమ్మతులు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా నేడు దవళేశ్వరం, అనంతపురం జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు చేసి బహిరంగసభలు నిర్వహించాలని భావించింది. కానీ పోలీసుల అనుమతి నిరాకరణతో రాజమండ్రి లోని హుకుంపేట బాలాజీ రోడ్డును వేదికగా చేసుకుంది. ఫలితంగా పవన్ కల్యాణ్ బహిరంగ సభ నిర్వహించింది. ప్రభుత్వ తీరుపై మండిపడింది.

వర్షం కురుస్తున్నా జనసేన నాయకులు లెక్కచేయకుండా మరమ్మతు పనుల్లో మమేకం అయ్యారు. మట్టి-సిమెంట్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శ్రమదానం చేయాలని భావించినా సాంకేతిక సమస్యలున్నందున వేదిక మార్చుకున్నారు. దీంతో రోడ్ల మరమ్మతుపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఉందని తెలిపేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తలు సీఎం జగన్ అంటుంటే అలా అనొద్దని మనసులో ఉంచుకోవాలని కోరారు. సీఎం అయితేనే అలా అనాలని సూచించారు. కార్యకర్తలు మనసులో దాచుకోవాలని హితవు పలికారు.
పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నా జనసేన నాయకులు మాత్రం ఆగలేదు. విమానాశ్రయం నుంచి సభా వేదిక వరకు పలు మార్గాల్లో పోలీసులు ఆక్షేపించినా పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారు కూడా ఏం చేయలేకపోయారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జనసేన కార్యకర్తలు బహిరంగసభకు విచ్చేశారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఉభయ గోదావరి జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. అభిమానుల కోలాహలం మధ్య పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వ నిర్వాకాన్ని తప్పుబట్టారు. భవిష్యత్ లో ప్రజాసమస్యల పరిష్కారంలో జనసేన ఎప్పుడు ముందుంటుందని గుర్తు చేశారు. వైసీపీ నేతల రాజకీయం చూస్తుంటే జాలేస్తుందని చెప్పారు.