టిక్ టాక్ సరికొత్త వ్యూహం.. ఫలించేనా?

కొద్దిరోజులుగా టిక్ టాక్ సంస్థకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గడచిన నెలరోజులుగా భారత్-చైనా సంబంధాలు చాలావరకు దెబ్బతిన్నాయి. గాల్వానాలోయ జరిగిన ఘర్షణలో 21మంది భారత జవాన్లు మృతిచెందడాన్ని కేంద్రం సీరియస్ తీసుకుంది. దీంతో చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతుంది. ఇందులో భాగంగా చైనా కంపెనీల కాంట్రాక్టర్లు రద్దుచేయడంతో చైనాకు చెందని 59యాప్స్ ను నిషేధించింది. భారత్ లో అత్యంత ప్రజాధరణ పొందిన టిక్ టాక్ కూడా నిషేధానికి గురైంది. దీంతో ఆ సంస్థకు […]

Written By: Neelambaram, Updated On : July 11, 2020 8:16 pm
Follow us on


కొద్దిరోజులుగా టిక్ టాక్ సంస్థకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గడచిన నెలరోజులుగా భారత్-చైనా సంబంధాలు చాలావరకు దెబ్బతిన్నాయి. గాల్వానాలోయ జరిగిన ఘర్షణలో 21మంది భారత జవాన్లు మృతిచెందడాన్ని కేంద్రం సీరియస్ తీసుకుంది. దీంతో చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతుంది. ఇందులో భాగంగా చైనా కంపెనీల కాంట్రాక్టర్లు రద్దుచేయడంతో చైనాకు చెందని 59యాప్స్ ను నిషేధించింది. భారత్ లో అత్యంత ప్రజాధరణ పొందిన టిక్ టాక్ కూడా నిషేధానికి గురైంది. దీంతో ఆ సంస్థకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

సచివాలయం కూల్చివేతకు.. కేటీఆర్ కు లింకేంటీ?

టిక్ టాక్ ను భారత్ నిషేధించడంతో కోట్లలో యూజర్లను కోల్పోయింది. దీంతో భారీస్థాయిలో నష్టాలను చావిచూస్తోంది. భారత్ దారిలోనే అమెరికా, యూరప్ దేశాలు టిక్ టాక్ ను బ్యాన్ చేసేందుకు యత్నిస్తుండటంలో ఆ సంస్థ నిర్వహాకులు ఆలోచనలో పడ్డారు. మరోవైపు చైనా దేశం హంకాంగ్ ప్రతిపత్తిని కాలరాసేలా బిల్లు తీసుకొచ్చింది. చైనాను వ్యతిరేకిస్తూ హంకాంగ్ ప్రజలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. హంకాంగ్ ప్రజలు టిక్ టాక్ యాప్ లో తమ నిరసన వ్యక్తం చేస్తుండటంతో చైనా ఆ దేశంలో టిక్ టాక్ ను బ్యాన్ చేసింది. దీంతో లక్షన్నర మంది యూజర్లను టిక్ టాక్ కోల్పోవాల్సి వచ్చింది.

చైనా తీరుతో టిక్ టాక్ సంస్థకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతుండటాన్ని గుర్తించింది. తమ ప్రధాన సంస్థ బీజింగ్ లో ఉండటంతో టిక్ టాక్ పై చైనాయాప్స్ అంటూ ముద్రపడుతుందని సంస్థ యాజమాన్యం ఆలస్యంగా గుర్తించింది. దీంతో తమపై చైనా యాప్ అనే ముద్రను తొలగించుకునే పనిలో పడింది. దీంతో తమ కార్యాలయాన్ని చైనా నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం తాము చైనాలో ఉండటం కంటే తమ మనుగడే ముఖ్యమని టిక్ టాక్ యాజమాన్యం భావిస్తోంది.

జగన్ టీంలోకి దూకుడు బ్యాచ్!

భారత్ నిషేధించిన టిక్ టాక్, హెలో యాప్ రెండింటికి బైట్‌డ్యాన్స్ మాతృ సంస్థ. దీని ప్రధాన కార్యాలయంలో బీజింగ్ లో ఉంది. తమ ప్రధాన కార్యాలయాన్ని బీజీంగ్ నుంచి తరలించడంతోపాటు కొత్త కార్యనిర్వాహక బోర్డును ఏర్పాటు చేసే పనిలో పడింది. తమది చైనాయాప్ అయినప్పటికీ చైనాకు పక్షపాతంగా వ్యవహరించ లేదని వివరణ ఇస్తోంది. ఇతర దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చేరవేయలేదని టిక్‌టాక్ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఆరోపణల నుంచి బయటపడటానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా భారత్ నిషేధించిన 59చైనా యాప్స్ కు కేంద్రం 79 ప్రశ్నలతో కూడిన నోటీసులను పంపించింది. ఈనెల 22లోపు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరింది. సదరు సంస్థ ఇచ్చే సమాధానాలతో కేంద్రం సంతృప్తి చెందితే తిరిగి యాప్స్ కు అనుమతిచ్చే అవకాశం ఉంది. తప్పడు సమాధానాలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సదరు యాప్స్ ఇచ్చే సమాచారాన్ని కేంద్రం తెప్పించుకున్న సమాచారంతో సరిపోతుందో లేదో చెక్ చేసి యాప్స్ విషయంలో భారత్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో టిక్ టాక్ సంస్థ ఏకంగా చైనా మరకను వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది. మరీ టిక్ టాక్ ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే..!