
ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ‘ఉచిత విద్యుత్’ పథకానికి కాలం చెల్లిపోయింది. అది కూడా ప్రతిపక్షం టిడిపి వారి పాలనలో కాకుండా అతని తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇలా జరగడం గమనార్హం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడం ద్వారా రైతులకు చేదోడువాదోడుగా ఉండాలన్నది వైఎస్ కల. అయితే అతని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని కొనసాగించాయి.
Also Read : సిల్వర్ జూబ్లీ వేడుకలా.. సిగ్గుచేటు బాబూ!
దేశంలో చాలా రాష్ట్రాలు రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకొని రాగా ఇది ‘ఓటు బ్యాంకు రాజకీయం’ అని చాలా మంది విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దీనికి మంగళం పాడేస్తూ ‘నగదు బదిలీ’ పథకాన్ని తెరమీదకు తెచ్చింది. విద్యుత్ రంగంలో సంస్కరణల దిశగా కేంద్రం రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఈ సూచనల పై కొన్ని రాష్ట్రాలు అభ్యంతారలని వ్యక్తం చేశాయి.
కేంద్రం చెప్పిన దానికి అనుగుణంగా జగన్ సర్కారు ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడేసి ఆస్థానంలో నగదు బదిలీ పథకాన్ని తీసుకొని వచ్చింది. ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం వారు వాడిన విద్యుత్తుని గుర్తించి దానికి సరిపడా సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని…. రైతులు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆ చెల్లించాలని పేర్కొంటూ జీవోని విడుదల చేసింది. దీనిలో భాగంగా కొత్త మీటర్లు బిగించేందుకు అయ్యే ఖర్చు కూడా సబ్సిడీ రూపంలో రైతుల ఖాతాల్లోకి వేస్తారట.
గ్రౌండ్ లెవల్ లో రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం కోసం వెంటనే స్పందించే యంత్రాంగం కూడా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ప్రభుత్వాలు మారితే రాజధానులే మారిపోతున్నాయి… అలాంటిది ఉచిత విద్యుత్తు, నగదు బదిలీ పథకాల్లో మార్పులు రాకుండా ఉంటాయా? విద్యుత్ పంపిణీ సంస్థలు వేస్తున్న బిల్లులు ఏ రేమ్జ్ లో ఉన్నాయో…. వారి జిమ్మిక్కులు ఎలాంటివో ఈ మధ్య మనం గమనిస్తూనే ఉన్నాం.
రైతుల్లో ఎంత మంది నిరక్షరాస్యులు. ఇలాంటి సమయంలో ఉచిత విద్యుత్ తొలగించి నగదు బదిలీ చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి అని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. ఇక రాజకీయ పరిశీలకులు మాత్రం దీని వల్ల రైతులకు ఏమాత్రం న్యాయం జరగదని అభిప్రాయపడుతున్నారు. దీని లోపల ఎన్ని నొసుగులు ఉన్నాయో.. ఎన్ని పరిమితులు ఉన్నాయో…. ఇంత బిల్లు వరకే ప్రభుత్వం ఉచితంగా కరెంటుని ఇస్తుందన్న షరతులు ఉన్నాయో ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read : యువతను టార్గెట్ చేసిన జగన్