https://oktelugu.com/

బండి సంజయ్ కు తీవ్ర అస్వస్థత.. సడన్ గా ఏమైంది?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సడన్ గా అనారోగ్యం పాలయ్యారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆస్పత్రి పాలయ్యారు. ఇది వరకు ఒకసారి ఆయన కరీంనగర్ లో ఎన్నికల ప్రచారంలో ఉండగా వడదెబ్బ తగిలి ఒకసారి.. గుండెపోటు వచ్చి మరోసారి కూడా సడన్ గా అస్వస్థతకు గురయ్యాడు. Also Read: బీజేపీ కొత్త కార్యవర్గం: పాత కాపులకు బై.. కొత్త నేతలకు జై అప్పుడు కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు వచ్చి పరామర్శించారు. కరీంనగర్ ఆపోలో ఆస్పత్రిలో […]

Written By: , Updated On : September 26, 2020 / 06:44 PM IST
Follow us on

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సడన్ గా అనారోగ్యం పాలయ్యారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆస్పత్రి పాలయ్యారు. ఇది వరకు ఒకసారి ఆయన కరీంనగర్ లో ఎన్నికల ప్రచారంలో ఉండగా వడదెబ్బ తగిలి ఒకసారి.. గుండెపోటు వచ్చి మరోసారి కూడా సడన్ గా అస్వస్థతకు గురయ్యాడు.

Also Read: బీజేపీ కొత్త కార్యవర్గం: పాత కాపులకు బై.. కొత్త నేతలకు జై

అప్పుడు కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు వచ్చి పరామర్శించారు. కరీంనగర్ ఆపోలో ఆస్పత్రిలో బండి సంజయ్ కు చికిత్స చేశారు. ఓ స్టంట్ కూడా గుండెకు వేసినట్టు సమాచారం.

అయితే అనంతరం కరీంనగర్ ఎంపీగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎదిగాడు. తాజాగా బీజేపీ కొత్త కార్యవర్గం ఏర్పాటు కోసం ఢిల్లీలో ఉన్నారు. డీకే అరుణను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంలో బండి కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది.

తాజాగా సడెన్ గా బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. 12 రోజులుగా బండి సంజయ్ ఢిల్లీలోనే ఉంటున్నారు.

Also Read: తన సమాధిపై ఏం రాయలో బాలు ముందే చెప్పారట!

నిన్న ఉదయం దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్ కి సాయంత్రం ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్యులు పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో కరోనా బాగా ఉండడంతో బండి సంజయ్ కు సోకిందా? లేక మరేదైనా అనారోగ్యమా అన్నది తేలాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.