https://oktelugu.com/

Budget 2024: రైల్వేకు కొత్త సొబగులు.. బడ్జెట్‌లో రూ.2.55 లక్షల కోట్లు!

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి మధ్యంతర బడ్జెట్‌లో రూ.14 వేల కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశి‍్వని వైష్ణవ్‌ తెలిపారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్‌లో పదిశాతం నిధులు పెంచినట్లు వెల్లడించారు. ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9,138 కోట్లు, తెలంగాణలో రైల్వే అభివృద్ధికి రూ.5,017 కోట్లు కేటాయించామని వివరించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 1, 2024 / 06:23 PM IST

    Budget 2024

    Follow us on

    Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం(ఫిబ్రవరి 1న) పార్లమెంటులో 2024-25 మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రైల్వే, విమానయాన రంగాలకు కేటాయింపులపై కీలక ప్రకటన చేశారు. పీఎం గతిశక్తి పథం కింద మూడు కారిడార్లు నిర్మిస్తామని చెప్పారు. ఈసారి రైలే‍్వకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 40 వేల సాధారణ రైలు భోగీలను వందేభారత్‌ కోచ్‌లుగా మాడిఫై చేస్తామని తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యం, భద్రత పెంచేలా భోగీలను మారుస్తామని పేర్కొన్నారు. రైలుమార్గాల్లో హై ట్రాఫిక్‌, హై డెన్సిటీ కారిడార్లలో నూతన సదుపాయాలు మెరుగుపరుస్తామని వివరించారు. ఇంధనం, మినరల్‌, సిమెంట్‌, పోర్టు కనెక్టివిటీ, హౌట్రాఫిక్‌ డెన్సిటీ కారిడార్లను పీఎం గతిశక్తి కార్యక్రమంలో అమలు చేస్తామని తెలిపారు. ​హై ట్రాఫిక్‌ డెన్సిటీతో ప్యాసింజర్‌ రైళ్ల వేగం పెరుగుతుందని తెలిపారు. ప్రయాణికులకు భద్రత పెరిగి వేగంగా గమ్యం చేరుకుంటారని పేర్కొన్నారు.

    మిమానయాన రంగానికి..
    ఇక విమానయాన రంగానికి కూడా కేంద్రం విమానయాన రంగంపైనా కేంద్రం కీలక ప్రకటన చేసింది. వచ్చే పదేళ్లలో కొత్త విమానాశ్రయాలు ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దశాబ్ద పాలనలో విమానాశ్రయాల సంఖ్యను 149కు పెంచుతామని తెలిపారు. టైర్‌-2, టైర్‌ – 3 నగరాలకు విమానాలు నడుపుతామన్నారు. కొత్తగా వంద విమానాలకు ఆర్డర్‌ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇది దేశ విమానరంగ అభివృద్ధికి సూచిక అని తెలిపారు.

    తెలుగు రాష్ట్రాలకు ఇలా
    తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి మధ్యంతర బడ్జెట్‌లో రూ.14 వేల కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశి‍్వని వైష్ణవ్‌ తెలిపారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్‌లో పదిశాతం నిధులు పెంచినట్లు వెల్లడించారు. ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9,138 కోట్లు, తెలంగాణలో రైల్వే అభివృద్ధికి రూ.5,017 కోట్లు కేటాయించామని వివరించారు. విశాఖ రైల్వే జోన్‌కు డీపీఆర్‌ సిద్ధమైందని ప్రకటించారు. రైల్వే జోన్‌ కోసం 53 ఎకరాల స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని, ఇంకా ప్రభుత్వం భూమి అప‍్పగించలేదని తెలిపారు. భూమి ఎప్పుడు ఇస్తే అప్పుడు పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఇక ఏడాదికి 240 కిలోమీటర్ల ట్రాక్‌ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీలో 98 శాతం విద్యుదీకరణ పూర్తయిందని, తెలంగాణలో 100 శాతం పూర్తి చేశామని వివరించారు. కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ పనులు మొదలైనట్లు తెలిపారు.