Budget 2024: బడ్జెట్ అనగానే చాలా మంది చూసేది ఏయే ధరలు పెరుగుతాయి.. వేటి ధరలు తగ్గుతాయి. పేద, మధ్య తరగతి ప్రజల దృష్టంతా వీటిపైనే ఉంటుంది. ఈ రెండే కావాలి. నిర్మలా సీతారామన్ గురువారం(ఫిబ్రవరి 1న) ప్రవేశపెట్టిన 2004-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఈసారి ఏముందో చూద్దాం. దేశంలో లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మోదీ సర్కార్ మరోసారి అధికారం దక్కించుకునేందుకు యత్నిస్తోంది. ఈ తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. మధ్యంతర బడ్జెట్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక అవసరాలను చూసుకుంటుంది. ఇక తాజా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక అంశాలు వెల్లడించారు. పన్నులు, కొత్త స్కీంలు, రాయితీలు మాత్రం ప్రకటించలేదు.
ధరలు పెరిగేవి, తగ్గేవి..
కేంద్రం తాజా బడ్జెట్‌లో ధరల పెంపు, తగ్గుదల విషయంలో కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. మధ్యంతర బడ్జెట్ కావడంతో ఎలాంటి వడ్డింపులు, ఊరటలు లేకుండానే బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. కానీ, పేద, మధ్య తరగతి ప్రజలు బడ్జెట్ అనగానే ఏవి పెరుగతాయి.. ఏవి తగ్గుతాయని ఎదురు చూశారు. ఈసారి మాత్రం అలాంటి ఏవీ లేవు. ఇది నిరాశ కలిగించే అంశమే. అయితే ప్రభుత్వం మధ్యతరగతికి, హెల్త్ వర్కర్లకు, యువతకు కాస్త ఊరట కలిగే ప్రకటన చేసింది.
మహిళలకు..
ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ల్యాక్ దీదీ స్కీమ్ విస్తరణ, ఎంట్రక్షపెన్యూర్లకు వడ్డీలేని రుణాలు, టూరిజం డెవలప్‌మెంట్‌కు వడ్డీ లేని రుణాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ స్కీంలో 2 కోట్లకుపైగా ఇళ్ల నిర్మాణం ఉంటుందని వివరించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాత ధరలే..
ఇక మధ్యతర బడ్జెట్ ధరల్లో మార్పు లేనందున కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ పాత ధరలే అమలులో ఉంటాయి. అంటే 2023లో ప్రకటించిన రాయితీలు, పెంచిన ధరలే అమలవుతాయి. 2023 బడ్జెట్ పరిశీలిస్తే కార్లు, స్మార్ట్ టీవీలు, ఫోన్లు, అనేక ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కస్టమ్ డ్యూటీ తగ్గించారు. ఈ ఉత్పత్తుల తయారీకి అవసరమైన కొన్ని భాగాల దిగుమతులపై సెస్, పన్నులను తగ్గించారు. దీంతో వాటి ధరలు తగ్గాయి. ఇక సిగరెట్లపై పన్నులను 16 శాతం పెంచారు. వాటి ధరలు పెరిగాయి. బంగారం, ప్లాటినమ్‌తో తయారు చేసిన వస్తువలు ధరలు కూడా పెరిగాయి. సిల్వర్ డోర్లు, బార్‌లు, ఆర్టికల్స్, కాపర్ స్క్రాప్, కాంపౌండ్ రబ్బరు ధరలు బాగా పెరిగాయి.