Namasthe Telangana: సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రధాన సైట్లు విమర్శించినప్పటికీ.. అల్లం నారాయణ దగ్గరికి పంచాయతీ వెళ్ళినప్పటికీ.. నో యూజ్.. నమస్తే తెలంగాణ యాజమాన్యం కోత లకే మొగ్గు చూపుతోంది.. వెళ్లండి వెళ్లండి దయచేయండి సాగనంపుతోంది. మొన్నటిదాకా గులాబీ రాతలు రాసి.. ప్రతిపక్షాల మీద బురద పూసిన జర్నలిస్టులు ఇప్పుడు నడిరోడ్డు మీద పడ్డారు. భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదు. ఈనాడు ఎట్టి పరిస్థితిలో తీసుకోదు. అది కెసిఆర్ కు భజన చేస్తుంది తప్ప.. కేసీఆర్ పత్రికలో చేసిన వారికి ఉద్యోగం ఇవ్వదు. సాక్షికి ఎలాగూ అవసరం లేదు.. ఆంధ్రజ్యోతి కి తెలంగాణ ఉద్యోగులు అంటే పెద్దగా గిట్టదు. ఇక వెలుగు అది ప్యూర్ కాంగ్రెస్ పత్రిక ఇప్పుడు. పైగా దాని భవిష్యత్తు ఏమిటో దాని ఓనర్ వివేక్ కే క్లారిటీ లేదు.. కాకపోతే ఇంతటి సంక్షోభంలోనూ నమస్తే తెలంగాణలో ధైర్యంగా ఉన్నారు అంటే అది బీటీ బ్యాచ్ మాత్రమే.
తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని ఏ విధంగానైతే కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నాడో.. నమస్తే తెలంగాణలో కూడా అలాంటి ఆంధ్ర మూలాలు ఉన్న జర్నలిస్టులే కీలక స్థానంలో ఉన్నారు. పైకి తెలంగాణ వాదం అని చెబుతున్నప్పటికీ ఈరోజుకి నమస్తే తెలంగాణ సండే డెస్క్ కు ఇన్చార్జిగా ఆంధ్ర మూలాలు ఉన్న జనార్ధన కరణం కొనసాగుతున్నారు. ఇక నమస్తే తెలంగాణ ప్రస్తుతం తిగుళ్ల కృష్ణమూర్తి చేతుల్లో ఉంది కాబట్టి.. ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే పత్రిక లో ఉంచుకున్నారని టాక్ నడుస్తోంది. యాజమాన్యం కూడా ఆ బాధ్యతలు మొత్తం కూడా ఆయనకే అప్పగించినట్లు తెలుస్తోంది. కొంతమంది నమస్తే తెలంగాణ జర్నలిస్టులు తమకున్న రాజకీయ పలుకుబడి ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తే.. తనకు ఆ విషయాలు చెప్పొద్దని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం.. అంతే కాదు ఇప్పుడు నమస్తే తెలంగాణ నుంచి బయటకు వెళ్తున్న వారంతా మొదటి నుంచి ఉన్నవారే. ఉద్యమ కాలంలో పత్రికను భుజాన మోసిన వారే. అయినప్పటికీ ప్రస్తుత కాలంలో తెలంగాణ ఉద్యమకారుల మాదిరిగానే వారిని కూడా నమస్తే తెలంగాణ యాజమాన్యం వదిలించుకుంటుంది. ఇదే సమయంలో బిటి బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ జర్నలిస్టులు మాత్రం కీలక స్థానంలో కొనసాగుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
వాస్తవానికి భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పటి కంటే నమస్తే తెలంగాణ పత్రిక ఇప్పుడే ఆ పార్టీకి అవసరం. ఎందుకంటే ప్రతిపక్షం గొంతును బలంగా తీసుకెళ్లాలి అంటే ఒక బలమైన మాధ్యమం భారత రాష్ట్ర సమితికి ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు మీడియా ఖచ్చితంగా వార్తలు వీలైనంత ఎక్కువ స్థాయిలో పబ్లిష్ చేస్తుంది. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అధికారాన్ని కోల్పోతే మీడియా కూడా పెద్దగా అటెన్షన్ చూపించదు. అలాంటప్పుడు ప్రతిపక్షాల గొంతు ప్రజలకు బలంగా వినిపించాలి అంటే సొంత మీడియా లేదా సొంత వాయిస్ తప్పనిసరి. మొన్నటి దాకా కోట్లకు కోట్ల యాడ్స్ తీసుకుని.. పేజీలకు పేజీల వార్తలు కుమ్మేసిన నమస్తే తెలంగాణ యాజమాన్యం అధికారం కోల్పోయి 15 రోజులు కూడా కాక ముందే ఉద్యోగులను అడ్డగోలుగా తొలగిస్తోంది.. ఇలాంటి పత్రిక యాజమాన్యం ఇలాంటి చర్యలకు పాల్పడి ఎలాంటి సందేశం తెలంగాణ ప్రజలకు ఇస్తున్నట్టు? ఇలాంటి పత్రిక తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని ఎందుకు చెబుతున్నట్టు!