BRS Formation Day Celebrations: శుభకార్యాల్లో తొలి పూజ గణపతికి ఎలా నిర్వహిస్తామో.. తెలంగాణ సంప్రదాయంలో ఏ ఇంట్లో శుభకార్యం నిర్వహించినా ఆడబిడ్డకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతీ కుటుబంలో ఆడబిడ్డను మహాలక్ష్మిగా భావిస్తారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ ఇంటి ఆడబిడ్డ కల్వకుంట్ల కవితను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. వాస్తవానికి తెలంగాణ సమాజం కవితను కేసీఆర్ గారాల కూతురుగా భావిస్తుంది. కానీ, ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రం పెద్దగా ప్రాపధాన్యం ఇవ్వడం లేదు. ఇటీవల టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుతూ ఏర్పాటు చేసిన పార్టీ కార్యర్గ సమావేశంలో కవిత లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. తాజాగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించిన కేసీఆర్ ఈ కార్యక్రమానికి కూడా కవిత కనిపించకపోవడం కావాలనే దూరం పెట్టారా..అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ముగిసిన టీఆర్‌ఎస్ ప్రస్థానం..
తెలంగాణ రాష్ట్రసమితి ప్రస్థానం డిసెంబర్ 9తో ముగిసింది. 22 ఏళ్ల ఉద్యమ పార్టీ అంతర్ధానమైంది. జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేర్‌రావు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చాలని నిర్ణయించారు. ఈమేరకు అక్టోబర్ 5న దసరా సందర్భంగా టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చాలని పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈమేరకు అదేరోజు ఎన్నికల సంఘానికి దరఖాస్తు కూడా అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో కల్వకుంట్ల కవిత కనిపించలేదు. తాజాగా టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చేందుకు సుముఖత తెలియజేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు లేఖ పంపింది. దీంతో శుక్రవారం మంచి ముహూర్తం ఉన్నందున ఎన్నికల సంఘం లేఖపై శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు సంతకం చేయాలని, తర్వాత జెండా ఆవిష్కరించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని పార్టీ నేతలను ఆదేశించారు.
సంతోషే సగం బలమా?
బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుక సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకలకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీనటుడు, కర్ణాకకు చెందిన ప్రకాశ్‌రాజ్ ముఖ్య అతిథిగా వచ్చారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఈ వేడుకకు వచ్చారు. కానీ కల్వకుంట్ల ఇంటి ఆడబిడ్డ కవిత కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు సతోష్‌రావు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. తెలంగాణ భవన్‌లోని అధ్యక్షుడి కార్యాలయంలో కొద్దిమందికి మాత్రమే పరిమిషన్ ఉంది. ఈకార్యలయంలో అతిథులంతా కూర్చుని ఉండగా సంతోష్ మాత్ర బుజంపై చిన్న కండువా వేసుకుని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుర్చీ పక్కన నిలబడి కనిపించారు. మధాహ్నం 1:20 గంటలు కాగానే సంతోష్ ఎన్నికల సంఘం లేఖను కేసీఆర్‌కు అందించి దగ్గరుండి మరీ సంతకం చేయించారు. తర్వాత బీఆర్‌ఎస్ కండువాలను సంతోషే స్వయంగా కేసీఆర్ చేతికి అందించారు. అన్నీ తానై నడిపిస్తున్నట్లుగా కనిపించారు.

మొత్తంగా.. బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలో కల్వకుంట్ల ఇంటి ఆడబిడ్డ కవిత కనిపించకపోవడం, అదే వేడుకలను సంతోష్ అన్నీ తానై నడిపించడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.