https://oktelugu.com/

Telangana Elections 2023 : దుమారం : ఎన్నికల్లో ఓడిపోతే సచ్చిపోతా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సంచలన ప్రకటన

ఈసారి హుజురాబాద్‌ నుంచి ఎలాగైనా గెలవాలని, ఈటల రాజేందర్‌ను ఓడించాలని కౌషిక్‌రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓటర్ల నుంచి సానుకూల స్పందన కనిపించడం లేదు.

Written By: , Updated On : November 28, 2023 / 08:11 PM IST
Follow us on

Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల ప్రచారం పరిసమాప్తమయింది. చివరి రోజు మూడు ప్రధాన పార్టీలు ప్రచారంలో భాగంగా చాలా వరకు రోడ్‌షోలతో హోరెత్తించాయి. సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. దీంతో ప్రలోభాల పర్వానికి నేతలు తెరతీశారు. అయితే చివరి రోజు ఎన్నికల ప్రచారంలో హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర. ఓడితే శవయాత్ర.. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి’ అంటూ ఓటర్లకు సూచించారు. ఒక రకంగా హెచ్చరించారు. ఒక్కసారి అవకాశమివ్వాలని ఓటర్లను వేడుకున్నారు.

హ్యాట్రిక్‌ ఓటమి..?
సాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బంధువు. క్రికెటర్‌ అయిన కౌషిక్‌రెడ్డి ఉత్తమ్‌ పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌ చేతిలో ఓటమి పాల్యయాడు. 2021లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ అధ్యక్ష్యుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయానికి కృషి చేసినా.. ఓటమి తప్పలేదు. తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్‌ కోటా నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం 1 ఆగష్టు 2021న మంత్రివర్గం సిఫారసు చేసింది. గవర్నర్‌ తిరస్కరించారు. తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలో‍్ల మరోమారు ఈటలపై పోటీ చేస్తున్నారు. ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌పై బరిలో నిలిచారు.

తరచూ వివాదాలు..
కౌషిక్‌రెడ్డి అగ్రసివ్‌గా ఉంటారు. దీంతో ఆయనకు ప్రచలతో సాన్నిహిత్యం తక్కువ. దుందుడుకుతనం, రాష్‌మెంటాలిటీ, సొంత పార్టీ నేతలపైనే దూషణలకు దిగడం, కులాల వారిని దూషించడం చివరకు గవర్నర్‌ను కూడా దుర్భాషలాడిన ఘటనలు ఉన్నాయి. గతంలో సినిమా హీరో రాజశేఖర్‌ సోదరుడిపై కూడా దాడి చేశారు. దీంతో రౌడీ మెంటాలిటీ ఉన్న కౌషిక్‌రెడ్డిని హుజూరాబాద్‌ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి వెనుకాడుతున్నారు.

ఈసారి గెలవాలని..
ఈసారి హుజురాబాద్‌ నుంచి ఎలాగైనా గెలవాలని, ఈటల రాజేందర్‌ను ఓడించాలని కౌషిక్‌రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓటర్ల నుంచి సానుకూల స్పందన కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆయన తన భార్య, కూతురును కూడా ప్రచారంలోకి దించారు. కౌషిక్‌ భార్య సెంటిమెంటును రగిల్చేలా కొంగుపట్టి ఓట్లు అగడం కనిపించింది. ఇక కూతురు మైనర్‌. నిబంధనల ప్రకారం ఆమె ప్రచారం చేయించొద్దు. కానీ, కౌషిక్‌రెడ్డి గెలుపు కోసం 12 ఏళ్ల కూతురుతో కూడా ప్రచారం మొదలు పెట్టారు. ఇంత చేసినా అనుకూల వాతావరణం కనిపించకపోవడంతో ప్రచారం ముగింపుకు కొన్ని గంటల ముందు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఏదైనా చర్య తీసుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.