బ్రిటన్ రాజవంశానికి కరోనా కాటు

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. అన్ని దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇండియాలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం లాక్డౌన్ వంటి చర్యలు చేపడుతుంది. తాజాగా బ్రిటన్ పిన్స్ చార్లెస్(71) కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ ప్రస్తుతం యూకేలో పంజా విసురుతోంది. ఇప్పటికే బ్రిటన్ రాణి క్విన్ ఎలిజిబెత్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆమె ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నారు. చార్లెస్ బ్రిటన్ రాణి […]

Written By: Neelambaram, Updated On : March 25, 2020 5:26 pm
Follow us on

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. అన్ని దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇండియాలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం లాక్డౌన్ వంటి చర్యలు చేపడుతుంది. తాజాగా బ్రిటన్ పిన్స్ చార్లెస్(71) కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ ప్రస్తుతం యూకేలో పంజా విసురుతోంది. ఇప్పటికే బ్రిటన్ రాణి క్విన్ ఎలిజిబెత్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆమె ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నారు.

చార్లెస్ బ్రిటన్ రాణి తరువాత సింహాసనాన్ని అధిరోహించనున్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 71సంవత్సరాలు. చార్లెస్ లో రోగ లక్షణాలు అంత తీవ్రంగా లేవని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని క్లెరెస్స్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం చార్లెస్ ఇంటికే పరిమితమయ్యారు. చార్లెస్ భార్య కెమిల్లాకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

చార్లెస్ ఇటీవల అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో ఏ సందర్భంలో ఆయనకు కరోనా సోకిందో చెప్పడం కష్టమని క్లెరెస్స్ హౌస్ ప్రకటింంది. వైద్యుల సూచనల మేరకు చార్లెస్, ఆయన భార్య కెమిల్లాను స్కాట్ ల్యాండ్‌లో సెల్ఫ్‌క్వారంటైన్‌లో ఉంటారని తెలిపారు. ప్రస్తుతం యూకేలో కరోనా కేసులు 8077నమోదయ్యాయ. ఇందులో 422 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. తాజాగా బ్రిటన్ రాజుకే కరోనా సోకడంతో యూకేవాసులు భయాందోళన చెందుతున్నారు.