https://oktelugu.com/

ఊపిరి పీల్చుకుంటున్న ఏపీ: రోడ్లపైకి జనం..

కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా జనజీవనం చిన్నా భిన్నమైంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో మరణాలు అధికంగా నమోదయ్యాయి. మొదటి వేవ్ పూర్తి కాగానే కాస్త ఊపిరి పీల్చుకున్న జనం కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో సెకండ్ వేవ్లో విజృంభించి కేసుల పెరుగుదలతో పాటు మరణాలు అధికంగానే నమోదయ్యాయి. అయితే కొన్ని రోజులుగా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో జనం ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం మళ్లీ […]

Written By: , Updated On : June 13, 2021 / 01:04 PM IST
Follow us on

కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా జనజీవనం చిన్నా భిన్నమైంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో మరణాలు అధికంగా నమోదయ్యాయి. మొదటి వేవ్ పూర్తి కాగానే కాస్త ఊపిరి పీల్చుకున్న జనం కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో సెకండ్ వేవ్లో విజృంభించి కేసుల పెరుగుదలతో పాటు మరణాలు అధికంగానే నమోదయ్యాయి. అయితే కొన్ని రోజులుగా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో జనం ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం మళ్లీ అదే నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తున్నారు.

2020 మార్చిలో మొదలైన కరోనా డిసెంబర్లో కాస్త తగ్గినట్లనిపించింది. దీంతో ప్రభుత్వం మూడు నెలల పాటు కఠినంగా లాక్డౌన్ విధించింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే డిసెంబర్ నాటికి కేసుల తగ్గుదల కావడంతో ఇక కరోనా తొలిగిపోయిందనే భ్రమలో జనం జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోయారు. పెళ్లిళ్లు, విందులు, వినోదాలకు అడ్డూ అదుపు లేకుండా హాజరయ్యారు. దీంతో సెకండ్ వేవ్ లో కేసులు లక్షల్లో నమోదయ్యాయి.

అయితే సెకండ్ వేవ్ ఉధృతిపై ఎవరూ అంచనాలు వేయలేదు. కొందరు వైద్య నిపుణులు హెచ్చరించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. స్కూళ్లను కూడా ప్రారంభించి క్లాసులు మొదలెట్టేశారు. దీంతో గత ఫిబ్రవరి ఎండింగ్ నుంచి కేసులు మళ్లీ పెరుగుదల ప్రారంభమైంది. మార్చి మధ్యలోకొచ్చేసరికి లక్ష్లల్లో కేసులు పెరిగాయి. దీంతో దేశంలోని కొన్ని రాష్ట్రాలు స్వచ్చంధంగా లాక్డౌన్ ప్రకటించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే పాక్షిక లాక్డౌన్ విధించింది.

సెకండ్ వేవ్ విజృంభణతో ప్రజల్లో చాలా అవగాహన వచ్చిందనే చెప్పవచ్చు. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎవరికి వారే స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు. ఇక గ్రామాల్లోనూ ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరగలేదు. అవసరమైన మెడిసన్ వాడుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక వ్యాక్సిన్ ను తీసుకోవడానికి ముందు భయపడినా ఆ తరువాత క్యూలు కడుతున్నారు. అయితే ఇటీవల కేసులు తగ్గుతుండడంతో జనం మళ్లీ రోడ్లపైకి వస్తున్నారు. కొందరు మాత్రం మళ్లీ అదే నిర్లక్ష్యంగా ఉంటున్నారు.