https://oktelugu.com/

ఊపిరి పీల్చుకున్న ఏపీ ప్రజలు..!

కరోనా కేసులు తగ్గుతుండడంతో ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న మధ్యాహ్నం కర్ఫ్యూను ఎత్తివేసింది. గత మార్చి ఏప్రిల్ మధ్య ఏపీలో రోజు వారీ 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ముందుగా కేసులు తగ్గుతాయని భావించిన ప్రభుత్వం మార్పు రాకపోయే సరికి తప్పనిసరి పరిస్థితుల్లో పాక్షిక లాక్డౌన్ ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. ఈ విధానం ఈనెల 30 వరకు సాగనుంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 21, 2021 12:40 pm
    Follow us on

    కరోనా కేసులు తగ్గుతుండడంతో ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న మధ్యాహ్నం కర్ఫ్యూను ఎత్తివేసింది. గత మార్చి ఏప్రిల్ మధ్య ఏపీలో రోజు వారీ 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ముందుగా కేసులు తగ్గుతాయని భావించిన ప్రభుత్వం మార్పు రాకపోయే సరికి తప్పనిసరి పరిస్థితుల్లో పాక్షిక లాక్డౌన్ ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. ఈ విధానం ఈనెల 30 వరకు సాగనుంది. ఆ తరువాత ప్రభుత్వం కేసుల పరిస్థితిని పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    తాజాగా కేసుల తగ్గుతల కనిపించడంలో మధ్యాహ్నం కర్ఫ్యూను ఎత్తి వేసింది. అయితే సాయంత్ర 6 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చింది. అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ కార్యకలాపాలు నిర్వహించుకొని 6 గంటలకు ఇళ్లలోకి చేరాలని సూచించింది. ఈ సడలింపులతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. రోజు వారి కార్మికుల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించుకునే వీలు కలిగింది.

    మరోవైపు ఆర్టీసీ బస్సులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు 10 నుంచి 2 గంటల వరకు సమయం మాత్రమే ఉండడంతో కొన్ని బస్సులు ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడే చిక్కిపోయాయి. మళ్లీ రిటర్న్ రావాలంటే తెల్లారేసరికి ఆగాల్సి వచ్చింది. తాజాగా ఇచ్చిన సడలింపులతో అంతర్ జిల్లాలకు బస్సలు వెళ్లనున్నాయి. అటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు కూడా ప్రయాణించనున్నాయి.

    ఇదిలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం అంతకుముందు ఉన్న నిబంధనలే కొనసాగనున్నాయి. ఈ జిల్లాలో రోజు వారి కేసులు వెయ్యికి పైగానే నమోదు కావడంతో ఇక్కడ యధావిధిగా కర్ఫ్యూ సాగుతుంది. అంటే ఈ జిల్లాలో 10 నుంచి 2 గంటల వరకు మాత్రమే సడలింపునిచ్చారు. ఇక్కడ ఆ విధానం ఈనెల 30 వరకు ఉండనుంది. అప్పటికీ కేసుల నమోదును బట్టి మళ్లీ నిర్ణయం తీసుకోనున్నారు.