https://oktelugu.com/

రేపటి నుంచి పాఠశాలలు మూసివేస్తూ ప్రభుత్వ నిర్ణయం

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ఆమె అధికారికంగా ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందుజాగ్రత్తగా చర్యగా తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు అన్నింటిని రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మూసివేత ఆదేశాలు వైద్యకళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల […]

Written By:
  • NARESH
  • , Updated On : March 23, 2021 / 05:23 PM IST
    Follow us on

    కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ఆమె అధికారికంగా ప్రకటించారు.

    కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందుజాగ్రత్తగా చర్యగా తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు అన్నింటిని రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

    అయితే ఈ మూసివేత ఆదేశాలు వైద్యకళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయి.

    విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్ లైన్ తరగతులు యాథావిధిగా కొనసాగుతాయని మంత్రి సబిత అసెంబ్లీలో ప్రకటించారు.

    గత సంవత్సరం కరోనా కల్లోలంతో పదోతరగతి సహా అందరు విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేయించి ప్రమోట్ చేసింది. ఈసారి కూడా అలానే జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు.