https://oktelugu.com/

బ్రేకింగ్: హైకోర్టులో మరోసారి ఎస్ఈసీకి ఎదురుదెబ్బ

ఎప్పుడూ పాజిటివ్ గానే కాదు.. ఈసారి నెగెటివ్ గానూ నిమ్మగడ్డకు ఫలితం వచ్చింది. ఏ కోర్టుద్వారానైతే ఆయన ఏపీ ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడించారో ఇప్పుడు అదే కోర్టులో ఆయనకు చుక్కెదురైంది. తాజాగా నిమ్మగడ్డ విధించిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను […]

Written By:
  • NARESH
  • , Updated On : March 16, 2021 12:39 pm
    Follow us on

    Nimmagadda

    ఎప్పుడూ పాజిటివ్ గానే కాదు.. ఈసారి నెగెటివ్ గానూ నిమ్మగడ్డకు ఫలితం వచ్చింది. ఏ కోర్టుద్వారానైతే ఆయన ఏపీ ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడించారో ఇప్పుడు అదే కోర్టులో ఆయనకు చుక్కెదురైంది. తాజాగా నిమ్మగడ్డ విధించిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది.

    ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది.

    ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విచారణకు ఆదేశించారు. ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

    ఎస్ఈసీ ఆదేశాలపై గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ఇవాళ తుదితీర్పును వెలువరించింది.

    గత ఏడాది నిలిచిపోయిన ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో విచారణ అధికారం ఎస్ఈసీకి లేదన్న పిటీషనర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.

    ఎస్ఈసీ ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు గతంలో ఏకగ్రీవమైన చోట్ల డిక్లరేషన్ ఇవ్వాలంటూ నిమ్మగడ్డకు గట్టి షాకిచ్చింది హైకోర్టు.