పొరుగు రాష్ట్రాల ఏపీ ఆర్టీసీ బస్సులకు బ్రేక్!

పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వివిధ కారణాలతో చిక్కుకు పోయిన తిరిగి తీసుకు రావడానికి శనివారం నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించిన ఏపీఎస్ ఆర్టీసీ అకస్మాత్తుగా ఆ ప్రయత్నాన్ని విరమించుకొంది. అంతుకు సాంకేతిక పరమైన కారణాలని చెబుతున్నా అసలేమీ జరిగిందో తెలియరావడం లేదు. మే 16 నుంచి సొంత రాష్ట్రానికి తీసుకెళతామంటూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో చిక్కుకు పోయిన వారి కోసం సరిహద్దు జిల్లాల ఆర్‌ఎంలు బస్సులు సిద్ధం చేశారు. మొదటి విడతగా ఎక్కువగా సుమారు 13 […]

Written By: Neelambaram, Updated On : May 16, 2020 1:12 pm
Follow us on

పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వివిధ కారణాలతో చిక్కుకు పోయిన తిరిగి తీసుకు రావడానికి శనివారం నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించిన ఏపీఎస్ ఆర్టీసీ అకస్మాత్తుగా ఆ ప్రయత్నాన్ని విరమించుకొంది. అంతుకు సాంకేతిక పరమైన కారణాలని చెబుతున్నా అసలేమీ జరిగిందో తెలియరావడం లేదు.

మే 16 నుంచి సొంత రాష్ట్రానికి తీసుకెళతామంటూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో చిక్కుకు పోయిన వారి కోసం సరిహద్దు జిల్లాల ఆర్‌ఎంలు బస్సులు సిద్ధం చేశారు. మొదటి విడతగా ఎక్కువగా సుమారు 13 వేలమంది ఉన్న హైదరాబాద్‌ నుంచి బస్సులు నడుపుతామని ప్రకటించారు.

అయితే ప్రత్యేక బస్సులు నడిపే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ శుక్రవారం ప్రకటించింది. హైద్రాబాద్ నుంచి ఏపీ కి వచ్చే బస్సులను కూడా సాంకేతిక కారణంగా వాయిదా వేసినట్టు ప్రకటించారు.

ప్రజలను తరలించేందుకు బస్సులను ఏర్పాటు పై రెండు రోజుల్లో తెలియచేస్తామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. బస్సులు ఎప్పుడు నడుస్తాయనేది తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. దీంతో బాధిత ప్రయాణికుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.