షర్మిల టూర్ కు ఎన్నికల బ్రేక్..?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయపార్టీ నెలకొల్పేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఓ విడత తన సానుభూతి పరులతో సమావేశం నిర్వహించిన షర్మిల.. క్షేత్రస్థాయి పర్యటనకు సైతం సిద్ధం అయ్యారు. ఖమ్మం జిల్లా పర్యటనలతో దీన్ని లాంఛనంగా ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ఆమె ప్రయత్నాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈనెల 21న షర్మిల నిర్వహించతలపెట్టిన ఖమ్మం జిల్లా టూర్ ను […]

Written By: Srinivas, Updated On : February 14, 2021 10:55 am
Follow us on


దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయపార్టీ నెలకొల్పేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఓ విడత తన సానుభూతి పరులతో సమావేశం నిర్వహించిన షర్మిల.. క్షేత్రస్థాయి పర్యటనకు సైతం సిద్ధం అయ్యారు. ఖమ్మం జిల్లా పర్యటనలతో దీన్ని లాంఛనంగా ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ఆమె ప్రయత్నాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈనెల 21న షర్మిల నిర్వహించతలపెట్టిన ఖమ్మం జిల్లా టూర్ ను వాయిదా వేసినట్లు తెలిసింది.

తెలంగాణలో రెండు పట్టభద్రులు శాసన మండలి నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు చొప్పున శాసన మండలి స్థానాలలకు ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ నెల 11వ తేదీన షెడ్యూల్ సైతం విడుదల అయ్యింది. మంగళవారం నోటిఫికేషన్ రానుంది. రెండు తెలుగురాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్ విడుదల కానుంది.

Also Read: టీఆర్‌‌ఎస్‌ మరోసారి ఆ సీటును వదులుకున్నట్లేనా..?

ఏపీలో ఉపాధ్యాయ, తెలంగాణలో రెండు పట్టభద్ర నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు రాబోతున్నాయి. ఏపీలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్టా.. గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాలు.. తెలంగాణలో హైదరాబాద్ రంగారెడ్డి.. మహబూబ్ నగర్.. నల్లొండ..ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున నల్గొండ.. ఖమ్మం.. వరంగల్ అభ్యర్థిగా రాములు నాయక్, హైదరాబాద్ రంగారెడ్డి.. మహబూబూనగర్ స్థానానికి చిన్నారెడ్డి పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ నుంచి వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు ఖరారు అయ్యింది.

Also Read: పెద్దలు జానారెడ్డి గారు.. మళ్లీ ఏసారు..

ఈ పరిణమాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు షర్మిల. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత మళ్లీ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే నెల 14వ తేదీన శాసనమండలి స్థానాలకు ఎన్నికలకు నిర్వహించాల్సి ఉంది. సుమారు నెలరోజుల సమయం పడుతుంది. ఈలోగా.. ఇతర జిల్లాలకు చెందిన పార్టీ అభిమానులు.. సానుభూతిపరులతో భేటీ కావాలని నిర్ణయించారు. ఈ విడత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభినమానులతో భేటీ కావాలని షర్మిల భావిస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుమీద రిజిస్ర్టేషన్ ప్రక్రియను షర్మిల త్వరలోనే ప్రారంభించనున్నారు. దీనికోసం న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రక్రియను కొడా రాఘవరెడ్డికి అప్పగించారు. పార్టీ ఎన్నికల గుర్తు, రిజిస్ర్టేషన్ ప్రక్రియ వ్యవహారాలకు సంబంధించిన సమాచారం త్వరలోనే వెలువడుతుంది. చేవెళ్లలో నిర్వహించే బహిరంగసభలోపు ఇదంతా పూర్తి చేయాలని భావిస్తున్నారు షర్మిల.