మోదీ నిర్ణయంపై ప్రపంచ దేశాల హర్షం

ప్రపంచ దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందును సరఫరా చేయనున్నట్లు భారత్ ప్రకటించడంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో భారత ప్రధాని మోదీని ఏకంగా హనుమంతుడితో పొల్చారు. కరోనా మహమ్మరికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందును నివారణ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ మందును భారత్ అత్యధికంగా తయారు చేస్తుంది. ఇటీవల ఈ మందును కరోనా పేషంట్లు మోతాదుకు మించి వాడుతుండటంతో మృత్యువాతపడ్డారు. దీంతో భారత్ ఈ హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందు ఎగుమతులపై నిషేధం విధించింది. […]

Written By: Neelambaram, Updated On : April 8, 2020 1:34 pm
Follow us on


ప్రపంచ దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందును సరఫరా చేయనున్నట్లు భారత్ ప్రకటించడంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో భారత ప్రధాని మోదీని ఏకంగా హనుమంతుడితో పొల్చారు. కరోనా మహమ్మరికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందును నివారణ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ మందును భారత్ అత్యధికంగా తయారు చేస్తుంది. ఇటీవల ఈ మందును కరోనా పేషంట్లు మోతాదుకు మించి వాడుతుండటంతో మృత్యువాతపడ్డారు. దీంతో భారత్ ఈ హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందు ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో ఈ డ్రగ్ సరఫరా నిలిచిపోయింది.

తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశానికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందు సరఫరా చేయాలని కోరారు. దీనిపై ప్రధాని మోదీ మౌనం వహించారు. దీంతో ట్రంప్ బెదిరింపు ధోరణికి దిగారు. అమెరికా అధ్యక్షుడు ఈ డ్రగ్ సరఫరా చేయాలని కోరడంతో ఈ మందుకు ఫుల్ డిమాండ్ పెరిగింది. కరోనా మహమ్మరి నివారణలో ఈ మందు పని చేస్తుందని శాస్త్రీయంగా నిరూపణ కాకపోయినప్పటికీ మానవతా దృక్పథంతో ఈ డ్రగ్ సరఫరాకు భారత్ అంగీకరించింది. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతోపాటు అవసరమైన దేశాలకు ఈ డ్రగ్ సరఫరా చేస్తామని మోదీ ప్రకటించారు. దీంతో మోడీ నిర్ణయంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో భారత ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు సంజీవని లాంటి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందు అందజేస్తున్నారని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో కొనియాడారు. భారత్ నిర్ణయంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు బెదిరింపులకు దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం మోదీ మహానీయుడంటూ కీర్తిస్తున్నాడు. బ్రెజిల్ అధ్యక్షుడు మోదీని హనుమంతుడితో పొల్చుతూ ప్రధానికి లేఖ రాశారు. నేడు హనుమన్ జయంతి కావడంతో ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.