BrahMos Missile: దిగుమతుల నుంచి ఎగుమతులు.. ఆంక్షలు నుంచి ఆకాంక్షలు.. బెదిరింపుల నుంచి స్నేహ హస్తాలు.. సాధింపుల నుంచి సాధికారతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ పరిపాలన కాలంలో రక్షణ పరంగా.. ద్వైపాక్షిక వాణిజ్యపరంగా.. ఒప్పందాలపరంగా భారతదేశం సాధించింది చాలా ఉంది. అందువల్ల నేడు ప్రపంచ దేశాలు.. ముఖ్యంగా చైనా.. అమెరికా భారత ప్రగతిని చూసి కుళ్ళు కుంటున్నాయి.
రక్షణ పరంగా భారతదేశం స్వయం సమృద్ధిని సాధించింది. ఇక్కడితోనే ఆగలేదు రక్షణ పరికరాలను ఉత్పత్తి చేస్తోంది. మన దేశం ఈ సంవత్సరం ఇప్పటివరకు 1.78 లక్షల కోట్ల ఆల్ టైం హై రికార్డు ఆర్డర్లను దక్కించుకుందంటే మాములు విషయం కాదు. అమెరికా, చైనా వల్ల కానిది కూడా భారత్ చేసి చూపించింది. సరిగ్గా గత ఏడాది ఈ ఆర్డర్లు కేవలం 23, 622 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈసారి మాత్రం ఎగుమతుల వృద్ధి ఏకంగా 62.66% శాతం ఉండడం గమనార్హం. అంతేకాదు ఎగుమతుల వృద్ధి విలువ 38,424 కోట్లకు చేరుకుంది.
మన దేశం రక్షణ పరంగా తయారు చేస్తున్న మిస్సైల్స్ లో బ్రహ్మోస్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇటీవల నరేంద్ర మోడీ ఇండోనేషియాలో పర్యటించినప్పుడు.. ఆ దేశం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీనికంటే ముందు వియత్నాం.. ఫిలిప్పీన్స్ దేశాలు బ్రహ్మోస్ మిస్సైల్స్ కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందాలకు తెచ్చుకున్నాయి.
మనదేశ రక్షణ పరికరాలకు అంతర్జాతీయంగా విపరీతమైన గిరాకీ ఉంది. అందువల్లే మన ఎగుమతుల విలువ 200 మిలియన్ డాలర్ల నుంచి 630 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ డిఫెన్స్ ఒప్పందాల్లో బ్యాటరీలు.. తీర ప్రాంతాన్ని సంరక్షించే వ్యవస్థలు.. శిక్షణ కూడా ఒక భాగంగా ఉన్నాయి.. బ్రహ్మోస్ మిస్సైల్స్ తో పాటు భారత్ తయారుచేసిన పినాక అనే రాకెట్ వ్యవస్థ కూడా కు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇటీవల ఆర్మేనియా అనే దేశం 2000 కోట్ల విలువైన పినాక రాకెట్ లాంచర్ బ్యాటరీల కోసం ఒప్పందం చేసుకుంది. ఇటీవల వీటి మొదటి విడత సరఫరాను రక్షణ మంత్రి జండా ఊపి ప్రారంభించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మరిన్ని రక్షణ పరికరాలను తయారు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. భారత్ సాగిస్తున్న డెవలప్ మెంట్ ను చైనా, అమెరికా తట్టుకోలేకపోతున్నాయి.
