KCR- Jagan: తెలంగాణలో సినీ రాజకీయం రంజుగా సాగుతోంది. భారీ పాన్ ఇండియా సినిమా బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు హైదరాబాద్ పోలీసులు చివరి నిమిషంలో అనుమతి క్యాన్సిల్ చేయడం తాజా రగడకు కారణమైంది. ఈ నేపథ్యంలో సినిమా రంగం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఫాలో అవుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులను తరిమి కొడతామన్న కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత వారికి కాలికి ముల్లు గుచ్చినా తన పంటితో తీస్తానని ప్రకటించారు. దీంతో ఆంధ్రా జనాలు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌వైపు నిలిచారు. సినిమా ఇండస్త్రీ మొత్తం కూడా గులాబీ పార్టీవైపు మళ్లింది. సీఎం తనయకుడు, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఏదైనా ఒక ట్వీట్ వేయగానే సినీ జనాలు లైక్‌లు, రీ ట్వీట్‌తో తాము మీ వెంటే ఉన్నామన్న సంకేతం ఇస్తున్నార

మారుతున్న పరిస్థితి..
ఇన్నాళ్లూ గులాబీ దళం వెంట ఉన్న సినీ జనాలు ఇప్పుడు మారుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రాలో సినిమా టికెట్ల విషయంలోనూ, థియేటర్స్ విషయంలోను ఆంధ్రా ముఖ్యమంత్రి మొదట్లో కఠినంగా వ్యవహరించారు. తర్వాత చూసిచూడనట్లు వదిలేశారు. కానీ సినీ జనాలకు జగన్ ఏంటో బాగా ఆర్ధం అయ్యింది. ఈ సమయంలో తెలంగాణ సీఎం సినిమా జనాలకు అడిగిందే అలస్యం వారు అడిగిన దానికి అన్నిటికి ‘ఎస్’ చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయి.
హోం మంత్రిని కలవడమే కారణమా..
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం అయ్యారు. ఇదేతో చేయకూడని, జరుగకూడని సమావేశం అన్నట్లు టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ భేటీ తర్వాత సినీ జనాలపై గులాబీ నేతలు గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించుకునే బ్రహ్మాస్త్రం సినిమా ప్రీరిలీజ్ పంక్షన్‌కు పర్మిషన్ ఇవ్వలేందనే ప్రచారం జరుగుతోంది. ఇది ఆరంభమే అని గులాబీ నేతలు చెబుతుండడంతో రాబోయే రోజుల్లో తెలంగాణ సర్కార్ సినీ జనాలకు చుక్కలు చూపుతుందన్న ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రాకు భిన్నంగా పరిస్థితి..
ఆంధ్రలో సినిమా ఫంక్షన్లకు పర్మిషన్ ఇవ్వకపోతే సిని జనాలతోపాటు ప్రతిపక్ష పార్టీలు, అభిమానులు కూడా హడవుడి చేస్తారు. తెలంగాణలో మాత్రం పరిస్థితి ఆంధ్రాకు భిన్నంగా ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా సినీ ఇండస్త్రీకి అండగా నిలవడం లేదు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణలో ఏం జరిగిన సైలెంట్‌గా ఉంటున్నారు. ఎందుకంటే బాబు ఒక విమర్శ చేస్తే కేసీఆర్ వంద విమర్శలు చేస్తారు. ఆ భయంతోనే బాబు సైలెంట్‌గా ఉంటున్నారు.

ఎవరు అధికారంలో ఉంటే వారి వెంటే..
తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాళ్లు అధికారంలో ఏ పార్టీ ఉంటే వారి వెంటే ఉంటూ వస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహం ఉన్నవారు అధికార పార్టీ కండువాలు కప్పుకున్న సందర్భాలను చూశాం. వచ్చే ఎన్నికల్లో ఫలనా పార్టీ వైపు ప్రజలు మెగ్గు చూప్పుతున్నారంటే చాలు వారివైపు చూస్తారు. తెలంగాణలో ఇప్పుడు రాజకీయం మారుతున్నట్లే సిని జనాలు కూడా కాస్త సైలెండ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. దానికి కారణం బీజేపీ నాయకత్వం తెలంగాణపై పెట్టిన ఫోకస్ కారణం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముందు ముందు అనుమతులు కష్టమే..
బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరిండం ద్వారా సినీ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం ఒక సంకేతం ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది. తమకు దూరమవుతున్న సినీ జనాలను అదుపులో పెట్టేందుకు, తిరిగి తమవైపు తిప్పుకునేందుకు ముందుముందు మరిన్ని కఠిన నిరణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ఆంధ్రా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిలాగానే థియెటర్స్ దగ్గరి నుంచి మొదలుకుని ఎక్కడ పబ్లిక్ సినీ ఫంక్షన్ జరిగినా ప్రభుత్వం వైపు నుంచి కఠినంగానే పరిష్మన్ ఉండబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సినిమాలు వాడుకుని రాజకీయం చేసే సినీ ప్రముఖుల కారణంగా సినిమా ఇండస్ట్రీపై ఆధారపడే అనేకమంది ఇప్పటి నుండే వేసే ప్రతి అడుగు, మాట్లాడే మాటలు కూడా కాస్తా జాగ్రతగా మాట్లాడాలి. ఎందుకంటే ఎవరిని పొగిడినా అధికార నేతలకు నొప్పి కలిగే అవకాశం ఉంటుంది.
Also Read:Asia Cup Super 4 schedule: ఆసియాకప్: ఈ సండే మళ్లీ ఇండియా-పాక్ బిగ్ ఫైట్.. సూపర్ 4 షెడ్యూల్ ఇదే