
Brahmanandam At MAA Elections: ‘మా’ ఎన్నికల పోలింగ్ వ్యవహారం రసవత్తరంగా జరుగుతోంది. ఒకపక్క మోహన్ బాబు చంపేస్తా.. చీరేస్తా అంటూ రెచ్చిపోతున్నారు అని రకరకాల వార్తలు వస్తున్నాయి. మరోపక్క మంచు విష్ణు తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌తో సరదగా మీడియాతో మాట్లాడుతున్నాడు. అయితే విష్ణు సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందం పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ బ్రహ్మానందం ఏమి చేశాడు ? ఎందుకు విష్ణు – ప్రకాష్ రాజ్ ఇద్దరూ కలిసి వచ్చి మరీ బ్రహ్మానందం గురించి ఎందుకు మీడియాకి ఫిర్యాదు చేశారు ? విష్ణు మాటల్లోనే.. ‘నాకు ప్రకాష్ రాజ్ గారికి అర్థం కాని విషయం ఏంటంటే.. ఓటు వేయడానికి బ్రహ్మానందం గారు వచ్చారు. రావడం రావడంతోనే అందరినీ తోసి, బ్రహ్మానందం బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లి ఎవరికో గుద్దేశారు.
అయితే, బ్రహ్మానందం గారు ఓటు ప్రకాష్ రాజ్ కు గుద్దారా? లేక నాకు గుద్దారా? అనేది తెలియడం లేదు. ఇదేంటి అని అడిగినందుకు, బ్రహ్మానందం గారు గట్టి గట్టిగా అరుస్తున్నారు’ అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. పైగా మీడియాకి విష్ణు ఒక సలహా ఇస్తూ.. బ్రహ్మానందం గారు వ్యవహారం గురించి, అసలు ఆయన ఎవరికీ ఓటు వేశారు అనే విషయం గురించి మీరే అడిగి తెలుసుకోవాలి’ అని మీడియాతో అన్నారు.
మొత్తానికి మా ఎన్నికలు కాసేపు కౌగిలింతలతో మధ్యమధ్యలో కొరుకులాటలతో అప్పుడప్పుడు కోరుకుంటూ పోలింగ్ ఆసక్తికరంగా జరుగుతుంది. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఓటు వేయడానికి సీనియర్ నటీనటులు వస్తున్నారు. ఎక్కువగా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న మంచు విష్ణు – ప్రకాష్ రాజ్ మధ్యే పోటీ ప్రధానమైంది.
కాబట్టి.. ఎవరు గెలిచినా ఫలితాల పై కాంట్రవర్సీ చేసే అవకాశం ఉంది. దీనికితోడు మోహన్ బాబు ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు.