Outer Ring Road : ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టు విషయంలో ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆ సంస్థకు కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే తన మొండితనాన్ని కొనసాగించింది. ఈ కాంట్రాక్ట్ ను దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ టోల్ వసూలు కార్యక్రమాన్ని గత రాత్రి నుంచి మొదలుపెట్టింది. వాస్తవానికి ఈ కాంట్రాక్ట్ ను ప్రభుత్వం 7380 కోట్లకు ఐఆర్ బీ సంస్థకు అప్పగించింది. 30 సంవత్సరాల పాటు ఈ సంస్థకు ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ ఉంటుంది. అయితే ఈ సంస్థ 48 రోజులు ముందుగానే ప్రభుత్వానికి 7380 కోట్లను లో చెక్కు రూపంలో ప్రభుత్వానికి చెల్లించింది. వాస్తవానికి టెండర్ ఫైనాన్షియల్ క్లోజర్ గా అడుగు సెప్టెంబర్ 27 కాగా, ఆగస్టు 11వ తేదీనే ఐ ఆర్ బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డబ్బును చెక్కు రూపంలో చెల్లించడం విశేషం.
వాస్తవానికి ఏప్రిల్ 27న (లెటర్ ఆఫ్ అగ్రిమెంట్) ఎల్ వో ఏ ను ఐఆర్ బీ అందుకుంది. సరిగ్గా నెల తర్వాత అంటే మే 26న హెచ్ఎండిఏతో కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ క్లోజర్ జరిగే 120 రోజుల్లో టెండర్ మొత్తం 7380 కోట్లు చెల్లించాలనే నిబంధన ఉండగా.. ఐ ఆర్ బి ఇన్ఫ్రాకు చెందిన ప్రతినిధుల బృందం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సిఎస్ శాంతి కుమారి, మునిసిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ లను కలిసి చెక్కు అప్పగించడం విశేషం. గత అర్ధరాత్రి నుంచే ఔటర్ రింగ్ రోడ్డును ఐఆర్బికి ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఫీజును, నిర్వహణను ఐఆర్బి ఆధ్వర్యంలో చేపడుతున్నారు. కాగా 1508 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు 8 లైన్ల ఎక్స్ప్రెస్ ప్రాజెక్టుకు గానూ చెల్లించాల్సిన మొత్తాన్ని 8,362 కోట్లుగా ఐఆర్బి అంచనా వేసుకొంది. ఈ మేరకు నిధులను సమకూర్చుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5500 కోట్లను ఐఆర్బి సంస్థకు అప్పుగా ఇచ్చింది. మిగతా 2,862 కోట్లకు గానూ జిఐసి తో కలిపి 1460 కోట్లు ఈక్విటీ రూపంలో అందించి 51% వాటా పొందినట్టు ఐఆర్బి సంస్థ ప్రకటించింది. ఇక మిగతా 49 శాతానికి సంబంధించి 1402 కోట్లను సింగ పూర్ సంస్థ సమకూర్చింది.
ఇంతటి భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుగానే ఫైనాన్షియల్ క్లోజర్ చేయడం గర్వకారణమని ఐఆర్బి సంస్థ చైర్మన్ వీరేంద్ర డి మహేష్కర్ ప్రకటించారు. ఒక సహకరించిన హెచ్ఎండిఏ, హెచ్ జి సి ఎల్, ఎస్బిఐ, తమ భాగస్వామి జిఐసి, సింగ పూర్ ఇతర వాటాదారులకు కృతజ్ఞతలు తెలిపారు. గత అర్ధరాత్రి నుంచి టోల్ ప్రారంభించామని, ప్రాజెక్టును మెరుగ్గా నిర్వహించి వాహనదారులకు ప్రపంచ స్థాయి ప్రధాన అనుభూతి అందిస్తామని వివరించారు. ఇక టిఓటి ప్రాతిపదికన అవుటర్ ను ఐఆర్బికి ఇది రెండవ టి వో టి ప్రాజెక్టు. ఈ రంగంలో ఐఆర్బి మార్కెట్ వాటా 37 శాతానికి చేరింది. ఈ ప్రాజెక్టు ఎస్వీపీ గా ఉన్న ఐఆర్బి గోల్కొండ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కేటగిరి రేటింగ్లో “ఏఏ” ను కలిగి ఉంది. దేశంలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ టోల్స్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్ గా ఐఆర్బి 11 రాష్ట్రాల్లో మాతృ సంస్థగా ఉంది. రెండు ఇన్విటీస్ తో 70 వేల కోట్ల ఆస్తులు కలిగి ఉంది. ఐఆర్ బీ గ్రూప్ 18 బిఓటి,2 టిఓటి, 4 హెచ్ ఏ ఎం ప్రాజెక్టులతో కలిపి మొత్తం 24 ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bought the toll on the outer ring road for 7380 crore
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com