Kangana Ranaut: ‘మండి’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గెలుపు.. ఎంత మెజారిటీతోనంటే?

హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు కాంగ్రెస్‌కు చెందిన విక్రమాదిత్య సింగ్‌పై పోటీ చేసి విజయం సాధించారు. వీరభద్ర సింగ్ గతంలో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు.

Written By: Neelambaram, Updated On : June 5, 2024 6:51 pm

Kangana Ranaut

Follow us on

Kangana Ranaut: సినీ నటి.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కంగనా రనౌత్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. క్వీన్ మరియు తను వెడ్స్ మను వంటి భారీ సినిమాల్లో నటించిన ఆమె మొదటి సారిగా ఎన్నికల్లో బీజేపీ తరుఫున హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 74,755 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది.

హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు కాంగ్రెస్‌కు చెందిన విక్రమాదిత్య సింగ్‌పై పోటీ చేసి విజయం సాధించారు. వీరభద్ర సింగ్ గతంలో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. అక్కడ విజయం సాధించిన ఆయన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యాడు. మొదటి సారి ఆయన లోక్ సభకు పోటీ చేశాడు.

మండి లోక్‌సభ స్థానంలో 2014, 2019లో వరుసగా బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ శర్మ విజయం సాధించారు. 2014లో 49.97 శాతం, 2019లో 68.75 శాతం ఓట్లతో విజయం సాధించారు. మార్చి 17, 2021న స్వరూప్ శర్మ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ సమయంలో విక్రమాధిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి గెలిచారు.

ప్రధాని నరేంద్రమోడీకి అభిమానించే కంగనా రనౌత్ ఈ సంవత్సరం (2024) మొదటి బీజేపీలో చేరింది. తన పూర్వీకులు ఉన్న మండి టికెట్ ఇవ్వాలని కోరింది. ఆమె కోరిక మేరకు బీజేపీ ఆ టికెట్ ను ఇచ్చి పోటీలో నిలిపింది.

‘నా ప్రియమైన భారత ప్రజలకు చెప్తున్నాను. ఈ రోజు బీజేపీ జాతీయ నాయకత్వం నా జన్మస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని మండి (నియోజకవర్గం) నుంచి లోక్‌సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడంపై హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. పార్టీలో అధికారికంగా చేరడం గౌరవంగా, ఆనందంగా భావిస్తున్నా. యోగ్యమైన కార్యకర్తగా, నమ్మకమైన ప్రజా సేవకురాలిగా ఎదురుచూస్తున్నా. ధన్యవాదాలు’ అని రనౌత్ మార్చి, 24న తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా పోస్ట్‌లో రాశారు.

రనౌత్ ముత్తాత సర్జూ సింగ్ రనౌత్ ఎమ్మెల్యే. ఆమె తల్లి, ఆశా రనౌత్, మండిలో పాఠశాల ఉపాధ్యాయురాలిగా పని చేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. ఆమె తండ్రి అమర్‌దీప్ రనౌత్ వ్యాపారవేత్త. ఆశా రనౌత్ కుటుంబం మొదట్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిందని, అయితే కంగనా ప్రభావంతో బీజేపీ వైపు మళ్లారు.

జూన్ 1న లోక్‌సభ ఎన్నికల ఏడో, చివరి దశ పోలింగ్ మండి లోక్ సభ నియోజకవర్గానికి జరిగాయి. రనౌత్ ప్రచారం సంచలనంగా మారింది. 2014లోనే భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని, భారతదేశం ‘హిందూ రాష్ట్రం’గా మారాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేసింది.

ఇక ఇవన్నీపక్కన పెడితే ఆమె గెలుపొందడంపై ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపుతున్నారు. మొదటి సారి ఆమె లోక్ సభలో అడుగు పెట్టబోతోంది.